కేటీఆర్‌పై ఒవైసీ ఆసక్తికర ట్వీట్‌ | MIM MP Asaduddin owaisi Praises KTR   | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై ఒవైసీ ఆసక్తికర ట్వీట్‌

Published Mon, Aug 26 2019 5:33 PM | Last Updated on Mon, Aug 26 2019 5:41 PM

MIM MP Asaduddin owaisi Praises KTR   - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొబైల్‌ సంస్థ వన్‌ప్లస్‌ సోమవారం హైదరాబాద్‌లో ఆర్‌ అండ్‌ డీ సంస్థ ప్రారంభించిన సందర్భంగా ఒవైసీ కేటీఆర్‌పై  ప్రశంసలు కురిపించారు.  గత ఏడాది ఒప్పో, మొన్న అమెజాన్‌, తాజాగా వన్‌ప్లస్‌ కేంద్రాలు హైదరాబాద్‌లో కొలువు దీరిన నేపథ్యంలో ఆయన స్పందించారు.  ప్రధానంగా లాస్ట్ ఇయర్ ఒప్పో..గతవారం అమెజాన్.. ఇప్పుడు వన్‌ప్లస్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్‌పై అసదుద్దీన్ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ క్రెడిట్‌ అంతా మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతేకాదు కేటీఆర్‌ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు వేచిచూస్తున్నానంటూ ట్వీట్‌ చేయడం విశేషం.  ఒవైసీ తాజా ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్‌ ఒవైసీకి ధన్యవాదాలు తెలిపారు. 
   

చదవండి :  భారీ పెట్టుబడితో వన్‌ప్లస్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement