భారత్‌లో మరో చైనా స్మార్ట్‌ఫోన్ | Sakshi
Sakshi News home page

భారత్‌లో మరో చైనా స్మార్ట్‌ఫోన్

Published Wed, Dec 3 2014 12:42 AM

భారత్‌లో మరో చైనా స్మార్ట్‌ఫోన్ - Sakshi

వన్‌ప్లస్ నుంచి వన్ స్మార్ట్‌ఫోన్
ధర రూ.21,999

 
న్యూఢిల్లీ: భారత మొబైల్ మార్కెట్లోకి మరో చైనా కంపెనీ ప్రవేశించింది. చైనాకు చెందిన వన్‌ప్లస్ కంపెనీ మంగళవారం వన్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.21,999. ఈ ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ చెప్పారు.  ఈ వన్ మొబైల్ ఫోన్‌లో 2.5 గిగాహెర్ట్స్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 5.5 అంగుళాల డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ,13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా,5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత సైనోజెన్‌మోడ్ 11ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుందని వివరించారు.

అతిపెద్ద మార్కెట్‌గా భారత్...
ప్రస్తుతం తమకు అతి పెద్ద మార్కెట్ చైనా అని, కానీ భవిష్యత్తులో ఈ స్థానానికి చైనాను తోసిరాజని భారత్ దూసుకువస్తుందని వికాస్ అగర్వాల్ పేర్కొన్నారు.  ఈ ఏడాది అక్టోబర్ వరకూ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల డివైస్‌లను విక్రయించామని చెప్పారు. రానున్న నెలల్లో బెంగళూరులో ఒక ఇంజినీరింగ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.  ఇటీవలే చైనాకు చెందిన షియోమి, ఒప్పొ, జొల్లా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement