వన్ ప్లస్ 6టీ ప్రతీకాత్మక చిత్రం
వన్‌ప్లస్ 6 ఇచ్చిన బూస్టప్‌తో మరింత దూకుడు పెంచిన కంపెనీ వన్‌ప్లస్ '6టీ' వేరియంట్‌ను మరింత గ్రాండ్ లుక్‌లో మార్కెట్లోకి తీసుకురాబోతుంది. తన అప్‌కమింగ్ వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘నోటిఫై మి’ అనే పేజీతో వన్‌ప్లస్ 6టీ అమెజాన్ ఇండియాలో బుధవారం నుంచి లైవ్‌కు వచ్చింది. అమెజాన్‌లో మాత్రమే కాక, టీవీల్లో, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లలో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ప్రమోషన్లను ఇస్తోంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వన్‌ప్లస్ 6టీ ప్రకటనలను అదరగొడుతున్నారు. వన్‌ప్లస్ 6టీ కమింగ్ సూన్ అనేది, అమెజాన్ ఇండియా టీజర్ పేజీలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు.
వన్‌ప్లస్ 6 లాంచ్ అయిన మూడు నెలల్లోనే దీని టీజర్ వచ్చేసింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తున్న తొలి వన్‌ప్లస్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇదే ఫీచర్‌ను వివో తన నెక్స్, వీ11 ప్రొ ఫోన్లలో, ఒప్పో ఆర్17 ప్రొలలో అందించాయి. వివో, ఒప్పో, వన్‌ప్లస్ లు సిస్టర్ బ్రాండ్‌లు. ఎప్పడికప్పుడూ తమ టెక్నాలజీలను ఈ కంపెనీలు షేర్ చేసుకుంటూ ఉంటుంటాయి. అయితే వన్‌ప్లస్ 6టీలో హెడ్‌ఫోన్ జాక్‌ను అందించడం లేదు. వైర్‌లెస్ ఛార్జింగ్ దీనికి ప్రధానమైన ఫీచర్‌గా వస్తోంది. బ్యాటరీ కూడా చాలా పెద్దదే అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారిత ఆక్సీజన్ ఓఎస్ ఫీచర్లుగా ఉండబోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment