న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 6ను మరికొన్ని గంటల్లో లాంచ్ చేయబోతోంది. మరికొన్ని గంటల్లో మార్కెట్ల ముందుకు రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్లను భారత్‌లో రివీల్ చేసింది ఆ కంపెనీ. లాంచ్ ఆఫర్లలో రూ.2000 డిస్కౌంట్, 12 నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను కల్పించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఐడియా కస్టమర్లకూ రూ.2000 క్యాష్‌బ్యాక్, డివైజ్ ఇన్సూరెన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కన్జ్యూమర్లకు రూ.250 విలువైన గిఫ్ట్ కార్డు, అమెజాన్ కిండ్లీపై రూ.500 వరకు డిస్కౌంట్ వస్తుంది. క్లియర్‌ట్రిప్‌తో వన్‌ప్లస్ కంపెనీ భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో విమానాలు, హోటల్ బుకింగ్స్‌పై రూ.25వేల వరకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ లాంచ్ ఆఫర్లతో పాటు వన్‌ప్లస్ ఇప్పటికే ఈ డివైజ్ ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లండన్‌లో మే 16న లాంచ్ చేస్తున్నారు. భారత్‌లో మే 17న విడుదల చేయనున్నారు. మే 21 నుంచి మే 22 మధ్యలో భారత్‌లోని ఎనిమిది నగరాల్లో పాప్-అప్ ఈవెంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వస్తోంది. లాంచ్ ఆఫర్లు కూడా మే 21 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు వెలువడుతున్నాయి.
ఫుల్ వ్యూ డిస్‌ప్లే, పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్, మ్యాట్ ఫినిషింగ్, గ్లాస్సీ లుక్‌తో వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 6.28 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ తదితర ఫీచర్లు వన్ ప్లస్ 6 ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment