Launch Offers
-
వన్‌ప్లస్ 6 లాంచ్ ఆఫర్లు రివీల్
న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 6ను మరికొన్ని గంటల్లో లాంచ్ చేయబోతోంది. మరికొన్ని గంటల్లో మార్కెట్ల ముందుకు రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆఫర్లను భారత్‌లో రివీల్ చేసింది ఆ కంపెనీ. లాంచ్ ఆఫర్లలో రూ.2000 డిస్కౌంట్, 12 నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను కల్పించనుంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఐడియా కస్టమర్లకూ రూ.2000 క్యాష్‌బ్యాక్, డివైజ్ ఇన్సూరెన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కన్జ్యూమర్లకు రూ.250 విలువైన గిఫ్ట్ కార్డు, అమెజాన్ కిండ్లీపై రూ.500 వరకు డిస్కౌంట్ వస్తుంది. క్లియర్‌ట్రిప్‌తో వన్‌ప్లస్ కంపెనీ భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో విమానాలు, హోటల్ బుకింగ్స్‌పై రూ.25వేల వరకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ లాంచ్ ఆఫర్లతో పాటు వన్‌ప్లస్ ఇప్పటికే ఈ డివైజ్ ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లండన్‌లో మే 16న లాంచ్ చేస్తున్నారు. భారత్‌లో మే 17న విడుదల చేయనున్నారు. మే 21 నుంచి మే 22 మధ్యలో భారత్‌లోని ఎనిమిది నగరాల్లో పాప్-అప్ ఈవెంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వస్తోంది. లాంచ్ ఆఫర్లు కూడా మే 21 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు వెలువడుతున్నాయి. ఫుల్ వ్యూ డిస్ప్లే, పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్, మ్యాట్ ఫినిషింగ్, గ్లాస్సీ లుక్‌తో వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 6.28 అంగుళాల డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్ బాడీ, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ తదితర ఫీచర్లు వన్ ప్లస్ 6 ఫోన్లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
జియోఫోన్ ఇక ఆ వెబ్సైట్లో కూడా...
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియోఫోన్‌కు, వినియోగదారుల్లో ఫుల్ క్రేజీ ఉంది. విడుదల చేసిన ప్రారంభంలోనే ఈ ఫోన్‌కు భారీ మొత్తంలో ఆర్డర్లు కూడా వచ్చాయి. ఆ డిమాండ్ తట్టుకోలేక ఒకానొక సమయంలో కంపెనీ బుకింగ్స్‌ను కూడా ఆపివేసింది. ఆ ఫోన్ ఇప్పటివరకు రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, రిలయన్స్ జియోవెబ్సైట్, మైజియో యాప్, జియో రిటైల్ పార్టనర్ స్టోర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇక ఇప్పటి నుంచి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో కూడా లభ్యమవుతుందట. రిలయన్స్ జియో, అమెజాన్ ఇండియా శుక్రవారం తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యంలో జియోఫోన్‌ను ఈ-కామర్స్ వెబ్సైట్లో కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నాయి. ఈ వారం ప్రారంభంలో మొబిక్విక్ ద్వారా కూడా జియోఫోన్ బుకింగ్‌లను చేపట్టవచ్చని కంపెనీ చెప్పింది. రూ.1500కు జియోఫోన్‌ను అమెజాన్ ఇండియా లిస్ట్చేసింది. ముందస్తు మాదిరిగానే జియోఫోన్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి, యూజర్లు తమ డివైజ్, దాని ఒరిజినల్ బాక్స్, ఆధార్ నెంబర్‌తో పాటు రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా రిలయన్స్ జియో పార్టనర్ స్టోర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు దీనిపై ప్రత్యేక లాంచ్ ఆఫర్లను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచుతోంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా జియో ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, కస్టమర్లకు 50 రూపాయల క్యాష్‌బ్యాక్ అందిస్తామని కంపెనీ చెప్పింది. అదేవిధంగా ఈ ఫోన్‌కు రీఛార్జ్‌ను కూడా అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారానే చేపడితే, ఫ్లాట్ 50 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నారు. గతేడాది జూలైలో ఈ ఫోన్‌ను లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ మాదిరి ఇంటర్నెట్ డివైజ్‌గా దీన్ని వాడుకునే అవకాశాన్ని రిలయన్స్ జియో కల్పించింది. 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈని ఇది ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్‌కు 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఉంది. మెమరీ కార్డు ద్వారా దీన్ని128జీబీ వరకూ పెంచుకోవచ్చు. వెనుక భాగంలో 2 మెగాపిక్సెళ్ల కెమెరా, ముందు వైపు వీజేఏ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా వల్ల వీడియో కాల్స్‌కు అనుమతి ఉంది. అలాగే అందరూ తరచుగా వాడే యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్‌క్రోమ్, ఫైర్ఫాక్స్వంటి వెబ్ బ్రౌజర్లు కూడా ఉన్నాయి. జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్, జియోఎక్స్‌ప్రెస్ న్యూస్ వంటి యాప్స్ ప్రీలోడెడ్‌గా వచ్చిన తొలి జియో-బ్రాండెట్ ఫోన్ ఇందే. జియోటీవీ యాప్ ద్వారా 450 ప్లస్ వరకూ లైవ్ టీవీ ఛానెళ్లని చూడొచ్చు. అలాగే జియోమ్యూజిక్ ద్వారా వివిధ భాషల్లో కోటి పాటల వరకూ యాక్సెస్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్‌తో తెలుగుతో సహా 22 భాషల్లో సహకారం. -
బంపర్ ఆఫర్లతో విక్రయానికి వస్తున్న రెడ్మి 4
షియోమి స్మార్ట్ ఫోన్లంటేనే మార్కెట్లో తెగ క్రేజ్. ఆన్ లైన్ అమ్మకానికి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోన్లకు భలే గిరాకి వస్తుంది. గతవారం షియోమి లాంచ్ చేసిన రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ రేపే(మంగళవారం) అమ్మకానికి వస్తోంది. అమెజాన్ ఇండియా, మి.కామ్ లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ను విక్రయానికి ఉంచుతోంది కంపెనీ. విక్రయానికి వస్తున్న ఈ ఫోన్ తో పాటు బంపర్ ఆఫర్లను కూడా షియోమి తీసుకొస్తోంది. అమెజాన్ ఇండియాలో రెడ్ మి4 కొనుగోలు చేస్తే, వొడాఫోన్ నెట్ వర్క్ పై 45జీబీ ఉచిత డేటాను ఐదు నెలల పాటు అందించనుంది. అయితే వొడాఫోన్ 1జీబీ లేదా 4జీ డేటా ప్యాక్ ను రెడ్ మి 4 కస్టమర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ 45జీబీ ఉచిత డేటా కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. అదేవిధంగా యస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లకు 500 రూపాయల క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేయనుంది. అమెజాన్ ఇండియాలో రెడ్ మి 4 పై ఉన్న మరిన్ని ఆఫర్లివివే... ఎంఐ కేసెస్ లేదా కవర్ల రేటు రూ.499 రూపాయల నుంచి రూ.349 రూపాయలకు దిగిరానుంది. ఎంఐ హెడ్ ఫోన్లు కూడా 599 రూపాయల నుంచే దొరకనున్నాయి. గోల్ బిబో విమానం, హోటల్ బుకింగ్స్ లో 5000 రూపాయల వరకు తగ్గింపు కిండ్ల్ యాప్ పై 200 రూపాయల క్రెడిట్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో రెడ్ మి4 లాంచ్ అయింది. 2జీబీ ర్యామ్/ 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 రూపాయలు, 3జీబీ వేరియంట్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలు, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలు. అయితే 4జీబీ వేరియంట్ మంగళవారం విక్రయానికి రావడం లేదు. జూన్ చివరి నుంచే ఈ వేరియంట్ విక్రయానికి వస్తోంది.