వన్‌ప్లస్‌ రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ | OnePlus 7 and OnePlus 7 Pro Launched Indian Markets | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

Published Wed, May 15 2019 8:59 AM | Last Updated on Wed, May 15 2019 9:01 AM

OnePlus 7 and OnePlus 7 Pro Launched Indian Markets - Sakshi

సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో  సరికొత్త  స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, సరసమైన ధర అంటూ వన్‌ప్లస్‌ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. వన్‌ప్లస్‌ సిరీస్‌లో వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో  డివైస్‌లను ఆవిష్కరించింది. ఈ నెల 17 నుంచి అమెజాన్‌  ద్వారా  అమ్మకాలుషురూ  కానున్నాయి.  అలాగే అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులుకు16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఎస్‌బిఐ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. 

సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, 16 ఎంపీ పాప్‌అప్‌ కెమెరా తదితర  ఫీచర్లను హైలెట్‌గా కంపెనీ చెబుతోంది.

వన్‌ప్లస్‌ 7 ప్రో ఫీచర్లు 
6.67 అంగుళాల ఆల్‌ స్క్రీన్‌ ఫ్లూయిడ్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే
90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
6 జీబీ/8 జీబీ/12 జీబీ ర్యామ్‌... 128 జీబీ/256 జీబీ స్టోరేజ్‌
 48+ 16 + 8  ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధరలు
6 జీబీ,128 జీబీ స్టోరేజ్‌ :  రూ. 48,999
8 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ : రూ. 52,999
12 జీబీ, 256జీబీ స్టోరేజ్‌ : రూ. 57,999 

వన్‌ప్లస్‌ 7  ఫీచర్లు
6.41 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ  డిస్‌ప్లే
వాటర్‌ డ్రాప్‌ నాచ్‌తో 60హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌
క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రోసెసర్‌
6 జీబీ, ర్యామ్‌, 8 జీబీ, ర్యామ్‌, 128 జీబీ, 256 జీబీ  స్టోరేజ్‌
48 +5 ఎంపీ రియర్‌ డబుల్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధరలు 
6జీబీ,128 జీబీ  స్టోరేజ్‌ : రూ.32,999
8 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ : రూ. 37,999

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement