two smartphones
-
వన్‌ప్లస్ రెండు స్మార్ట్ఫోన్లు లాంచ్
సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, సరసమైన ధర అంటూ వన్‌ప్లస్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. వన్‌ప్లస్ సిరీస్‌లో వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో డివైస్‌లను ఆవిష్కరించింది. ఈ నెల 17 నుంచి అమెజాన్ ద్వారా అమ్మకాలుషురూ కానున్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులుకు16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఎస్బిఐ క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సరికొత్త ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపీ పాప్అప్ కెమెరా తదితర ఫీచర్లను హైలెట్‌గా కంపెనీ చెబుతోంది. వన్‌ప్లస్ 7 ప్రో ఫీచర్లు 6.67 అంగుళాల ఆల్ స్క్రీన్ ఫ్లూయిడ్ ఆమోలెడ్ డిస్ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ 6 జీబీ/8 జీబీ/12 జీబీ ర్యామ్... 128 జీబీ/256 జీబీ స్టోరేజ్ 48+ 16 + 8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ పాప్అప్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6 జీబీ,128 జీబీ స్టోరేజ్ : రూ. 48,999 8 జీబీ, 256 జీబీ స్టోరేజ్ : రూ. 52,999 12 జీబీ, 256జీబీ స్టోరేజ్ : రూ. 57,999 వన్‌ప్లస్ 7 ఫీచర్లు 6.41 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్‌తో 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రోసెసర్ 6 జీబీ, ర్యామ్, 8 జీబీ, ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 +5 ఎంపీ రియర్ డబుల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 6జీబీ,128 జీబీ స్టోరేజ్ : రూ.32,999 8 జీబీ, 256 జీబీ స్టోరేజ్ : రూ. 37,999 -
హెచ్‌టీసీ డిజైర్‌లో కొత్త స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: తైవాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ బుధవారం రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. డిజైర్ సిరీస్‌లో హెచ్‌టీసీ డిజైర్ 12, హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ డివైస్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. హెచ్‌టీసీ డిజైర్ 12 ధరను 15,800 రూపాయలుగానూ, హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ధరను 19,790గా ను నిర్ణయించింది. గురువారం నుంచి ప్రీ ఆర్డర్లను ప్రారంభించనుంది. జూన్ 11 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మొదలుకానున్నాయి. 18.9 యాస్పెక్ట్ రేషియో, ఎడ్జ్ టూఎడ్జ్ డిస్ప్లే తమ నూతన స్మార్ట్ఫోన్ల సొంతమనికంపెనీ చెబుతోంది. హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ఫీచర్లు 6అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ డిస్ప్లే క్వాల్కం స్నాప్ డ్రాగన 450 ఎస్వోసీ ప్రాసెసర్ 720x1440 రిజల్యూషన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 2965 ఎంఏహెచ్ బ్యాటరీ హెచ్‌టీసీ డిజైర్ 12 ఫీచర్లు 5.5 అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ మీడియా టెక్ ఎంటీ 6739 క్వాడ్ కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 2టీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2,730 ఎంఏహెచ్ బ్యాటరీ -
నేహా ధుపియా : హానర్ స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: హువావే సబ్-బ్రాండ్ హానర్ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరల్లో హానర్ 7ఏ, 7సీ పేరుతో ఇండియాలో ప్రారంభించింది. గత నెల చైనాలో లాంచ్ చేయగా మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖనటి నేహా ధుపియా మీదుగా ఈ రెండు డివైస్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రత్యేకంగా ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి లభ్యం. ముఖ్యంగా షావోమికి చెందిన రెడ్ మీ 5, 5ఏకు పోటీగా ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా వీటిని లాంచ్ చేసింది. భారత వినియోగదారుల కోసం పేటీఎం ఫీచర్‌తోపాటు రైడర్స్ సౌకర్యంకోసం రైడ్‌మోడ్ అనే ఫీచర్‌ను యాడ్ చేశామని హానర్ ఇండియా ప్రతినిధి సుమీత్ అరోరా తెలిపారు. ఇండియా టాప్ 5 బ్రాండ్‌గా హానర్ నిలిచిందని పేర్కొన్నారు. షావోమీ, వన్‌ప్లస్‌తో పోలిస్తే 146 శాతం హయ్యస్ట్ గ్రోత్ సాధించామని సుశీల్ తారిఖ్ హువావే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రకటించారు. జియో భాగస్వామ్యంతో మోర్ డేటా, మోర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తున్నామని హానర్ తెలిపింది. హానర్ 7ఏ ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720 x 1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ 3జీబీ/32జీబీ స్టోరేజ్ 13+2ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్ లో లభ్యం హానర్ 7సీ ఫీచర్లు 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 720 x1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్ 3జీబీ/4జీబీ ర్యామ్ 32జీబీ/64జీబీ స్టోరేజ్ 13+2ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు: 7ఏ ధర 8,999 రూపాయలు నిర్ణయించింది. ఇది మే29 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోఉంటుంది. కాగా 7 సీ ధర రూ.9,600, 11,999 రూపాయలు ఉంది. ఇది అమెజాన్ ద్వారా మే31న విక్రయానికి లభ్యం. -
బడ్జెట్ ధరలో లెనోవో కొత్త స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్మేకర లెనోవో కే సిరీస్‌లో నూతన స్మార్ట్ఫోన్లునులంచ్ చేసింది. కె5, కె5 ప్లే పేరుతో రెండు స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే భారత మార్కెట్లనుకూడా పలకరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు ఒకసారి చూద్దాం. లెనోవో కె5 రూ.9,300 ధరకు లభ్యం కానుండగా, కె5 ప్లే రూ.7,200 ధరకు లభించనుంది. లెనోవో కె5 ఫీచర్లు 5.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ లెనోవో కె5 ప్లే ఫీచర్లు 5.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ జె సిరీస్ ను విస్తరిస్తూ తాజాగా గెలాక్సీ జె2ఏస్, గెలాక్సీ జె1 4జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రూ. 10 వేల లోపు ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జె2 ఏస్ ధర ను రూ.8,490, గెలాక్సీ జె1 4జీ ధరను రూ. 6,890 కంపెనీ నిర్ణయించింది. అలాగే ఈ రెండు మోడల్స్ లో బ్రౌజింగ్ అనుభవంకోసం ఎస్ సెక్యూర్' 'ఎస్ పవర్ ప్లానింగ్' , అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ ఫీచర్స్ అందించడం ప్రత్యేకత. సరసమైన ధరలకు 4జీ మొబైళ్లను వినియోగదారులకు అందించడం తమ లక్ష్యమని శాంసంగ్ ఇండియా(మొబైల్ బిజినెస్) ఉపాధ్యక్షుడు మను శర్మ పేర్కొన్నారు. జె2 ఏస్ 5 ఇంచెస్ స్క్రీన్ టర్బో స్పీడ్ టెక్నాలజీ 1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1.5జీబీ ర్యామ్ 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా గెలాక్సీ జె1 4జీ 4.5 ఇంచెస్ స్క్రీన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా -
హ్యాకర్లకు గూగుల్ బంపర్ ఆఫర్
మొబైల్ మార్కెట్ రంగంలో యాపిల్ తో పోటీ పడుతున్న గూగుల్ మొబైల్ హ్యాకర్లకోసం ఓ షాకింగ్ ఆఫర్ ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్లతో ఇటీవల లాంచ్ చేసిన తన ప్రఖ్యాత నెక్సస్ 5ఎక్స్, నెక్సస్ 6పి స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసిన వారికి భారీ బహుమతిని ప్రకటించింది. ఓ ప్రత్యేక మైన హ్యాంకింగ్ ద్వారా తన స్మార్ట్ ఫోన్లలోని లోపాన్ని గానీ, ఏదైనా బగ్ ను గానీ కనుగొన్న హ్యాకర్లు ప్రథమ బహుమతి 200,000 డాలర్లు (రూ 1.3 కోట్లు) సంపాదించే అవకాశం కల్పిస్తోంది. గూగుల్ 'ప్రాజెక్ట్ జీరో ప్రైజ్' పథకంగా ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇవ్వనుంది. రెండవ బహుమతిగా సుమారు 67 లక్షలు(100,000 డాలర్లు) మూడవ బహుమతిగా సుమారు 38 లక్షలు (50,000 డాలర్లు) అందిస్తామని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13నుంచి మొదలైన ఈ పోటీ వచ్చే ఏడాది 2017 మార్చి 13 న ముగియనుందని గూగుల్ వెల్లడించింది. అలాగే మరికొంతమంది ఎంపిక చేసినవారికి టెక్నికల్ రిపోర్ట్ రాయాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దీన్ని ప్రాజెక్ట్ జీరో బ్లాగ్ లో ప్రచురిస్తుంది.కాగా మొబైల్ ఫోన్లలో నెక్సస్ సిరీస్ ను ఐదేళ్ల కిందట ప్రారంభించిన గూగుల్.. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మార్షమల్లోతో నెక్సస్ 5 ఎక్స్, 6 పీలను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.