శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ జె సిరీస్ ను విస్తరిస్తూ తాజాగా గెలాక్సీ జె2ఏస్, గెలాక్సీ జె1 4జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రూ. 10 వేల లోపు ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జె2 ఏస్ ధర ను రూ.8,490, గెలాక్సీ జె1 4జీ ధరను రూ. 6,890 కంపెనీ నిర్ణయించింది. అలాగే ఈ రెండు మోడల్స్ లో బ్రౌజింగ్ అనుభవంకోసం ఎస్ సెక్యూర్' 'ఎస్ పవర్ ప్లానింగ్' , అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ ఫీచర్స్ అందించడం ప్రత్యేకత.
సరసమైన ధరలకు 4జీ మొబైళ్లను వినియోగదారులకు అందించడం తమ లక్ష్యమని శాంసంగ్ ఇండియా(మొబైల్ బిజినెస్) ఉపాధ్యక్షుడు మను శర్మ పేర్కొన్నారు.
జె2 ఏస్
5 ఇంచెస్ స్క్రీన్
టర్బో స్పీడ్ టెక్నాలజీ
1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
1.5జీబీ ర్యామ్
8 మెగా పిక్సల్ రియర్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
గెలాక్సీ జె1 4జీ
4.5 ఇంచెస్ స్క్రీన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
1జీబీ ర్యామ్
5 మెగా పిక్సల్ రియర్ కెమెరా,
2 ఎంపీ ఫ్రంట్ కెమెరా