శామ్సంగ్ గెలాక్సీలో మరో రెండు ఫోన్లు
గెలాక్సీ జే2 2016@రూ.9,750 జే మ్యాక్స్@ రూ.13,400
బెంగళూరు: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ జే సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు-గెలాక్సీ జే2 2016, గెలాక్సీ జే మ్యాక్స్‌లను మార్కెట్లోకి తెచ్చింది. 2015లో అందుబాటులోకి తెచ్చిన గెలాక్సీ జే2 ఫోన్‌కు కొనసాగింపుగా గెలాక్సీ జే2 2016ను అందిస్తున్నామని, ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,750 అని శామ్సంగ్ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ ఈ గెలాక్సీ జే2యేనని పేర్కొంది. పూర్తి స్థాయిలో వినోదం కావాలనుకునే వారి కోసం గెలాక్సీ జే మ్యాక్స్‌ను అందిస్తున్నామని, ధర రూ.13,400 అని వివరించింది. రేపటి(ఈ నెల 10న) నుంచి గెలాక్సీ జే2 2016ను, ఈ నెల చివరి నుంచి గెలాక్సీ జే మ్యాక్స్ ఫోన్ల విక్రయాలను ప్రారంభిస్తామని పేర్కొంది. గెలాక్సీ జే మ్యాక్స్‌లో 7 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ డిస్ప్లే, వేగంగా డౌన్లోడ్ చేసుకోవడానికి, స్ట్రీమింగ్ కోసం 4జీ వీఓఎల్టీఈ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్నాయని వివరించింది.
రూ.4,500 విలువైన డేటా ఆఫర్ ఉచితం...
గెలాక్సీ జే2 2016లో టర్బో స్పీడ్ టెక్నాలజీ, స్మార్ట్ గ్లో(నెక్స్ జనరేషన్ ఎల్ఈడీ నోటిఫికేషన్ సిస్టమ్) వంటి ప్రత్యేకతలున్నాయని శామ్సంగ్ కంపెనీ పేర్కొంది. గెలాక్సీ జే2 2016 స్మార్ట్ఫోన్లు నలుపు, బంగారం, వెండి రంగుల్లో లభ్యమవుతాయని తెలిపింది ప్రమోషనల్ ఆఫర్‌గా ఎయిర్టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారులకు రూ.4,500 విలువైన ఆరు నెలల డబుల్ డేటా ఆఫర్‌ను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌పై పనిచేసే గెలాక్సీ జే2 2016 స్మార్ట్‌ఫోన్‌లో ఆల్ట్రా డేటా సేవింగ్, ఎస్ బైక్ మోడ్, 5 అంగుళాల సూపర్ అమెలెడ్ డిస్ప్లే, 1.5 గిగా హెర్ట్స్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇన్‌బిల్డ్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, డ్యుయల్ సిమ్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది.. డౌన్లోడ్ స్పీడ్ 150 ఎంబీపీఎస్ అని, అప్లోడ్ స్పీడ్ 50 ఎంబీపీఎస్ అని శామ్సంగ్ పేర్కొంది.