వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్
గత వారం టీజ్ చేసిన మాదిరిగానే వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు జూలై 16 నుంచి వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ భారత్‌లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ వన్‌ప్లస్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇటీవలే వన్‌ప్లస్ 6 మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను భారత్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్మార్ట్‌ఫోన్ 256 జీబీ వేరియంట్‌లో రూ.43,999కు జూలై 14 నుంచి వినియోగదారుల కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
2.8 గిగాహెడ్జ్
డ్యూయల్ సిమ్ సపోర్ట్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్‌ఓఎస్ 5.1
6.28 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా
16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆప్టికల్ కోటింగ్, ఆరు గ్లాస్ ప్యానల్స్‌తో ఇది రూపొందింది.
టాప్ గ్లాస్ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్ లేయర్ ఉంది.
రెడ్‌తో మెటాలిక్ రెడ్ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది
మిర్రర్ మాదిరి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిల్వర్ కెమెరా లెన్స్
వన్‌ప్లస్ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్ 6 పేరొందింది. ఈ డివైజ్ లాంచ్ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment