
వన్‌ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 అప్డేట్ తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ గత ఏడాది జూలైలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 10తో విడుదల చేశారు. మార్చి 1నుంచి వన్‌ప్లస్ నార్డ్ యూజర్లకు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ దశల వారీగా రావడం ప్రారంభమైంది. ఈ అప్డేట్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇందులో ప్రధానంగా కెమెరా ఇంటర్‌ఫేస్ మెరుగుదలతో పాటు హెచ్‌ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. యాంబియంట్ డిస్ప్లే ట్వీక్స్, మెరుగైన డార్క్ మోడ్, షెల్ఫ్ ఈ అప్డేట్ లో అందించారు.
Comments
Please login to add a commentAdd a comment