వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్ | The OnePlus 7, 7T are Finally Getting Android 11 Beta Update | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్

Published Thu, Jan 21 2021 11:34 AM | Last Updated on Thu, Jan 21 2021 11:46 AM

The OnePlus 7, 7T are Finally Getting Android 11 Beta Update - Sakshi

వన్‌ప్లస్ చివరకు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11బీటా బిల్డ్ ను వన్‌ప్లస్ 7, 7టీ సిరీస్‌లకు విడుదల చేస్తోంది. ఈ కొత్త బిల్డ్ ను ఇతర మొబైల్ కంపెనీలతో పోలిస్తే చాలా ఆలస్యంగా తీసుకొచ్చింది. మిగతా వన్‌ప్లస్ వినియోగదారులకు ఈ అప్డేట్ త్వరలోనే అందనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ నార్డ్ ఇది వరకే ఆక్సిజన్ ఓఎస్ 11 బీటా బిల్డ్‌ను అందుకున్నాయి. దీని తర్వాత 2019 విడుదలైన వన్‌ప్లస్ 7, 7టీ మొబైల్స్ కు అప్డేట్ రావడం మొదలైంది. ఈ అప్డేట్ దశల వారీగా రానున్నట్లు ప్రకటించింది.(చదవండి: బడ్జెట్ లో రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్)   

ఈ బిల్డ్ లో ఆల్వేస్ ఆన్-డిస్ప్లే, న్యూ సిస్టమ్ ఫాంట్, జెన్ మోడ్ లను మెరుగుపరిచారు. ఇందులో ప్రధానంగా కెమెరా ఇంటర్‌ఫేస్‌ మెరుగుదలతో పాటు హెచ్‌ఇవిసి సపోర్ట్ చేసే వీడియో-అఫిషియోనాడోస్ ను తీసుకొచ్చారు. ఇది బీటా బిల్డ్ కాబట్టి వన్‌ప్లస్ టెస్టింగ్ లో భాగంగా కొన్ని ఫీచర్స్ సరిగా పనిచేయకపోవచ్చు. కొందరు ఇప్పటికే విద్యుత్ వినియోగం పెరిగినట్లు గమనించారు. కొన్ని ఫోటోలు గ్యాలరీలో కనబడకపోవడం, బ్లూటూత్ ద్వారా పనిచేసే పరికరాలు సౌండ్ రాకపోవడం, బ్రైట్ అడ్జస్ట్మెంట్ సరిగా పనిచేయకపోవడం వంటివి కొందరు గమనించినట్లు పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement