సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టీ ని భారత మార్కెట్లో కూడా లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 గా నిర్ణయించింది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది. నవంబరు 1 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులోకి రాన్నుఆయి. అలాగే నవంబర్ 3వ తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్ సహా వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లు, క్రోమా స్టోర్స్‌లోనూ వన్‌ప్లస్ 6టీ లభ‍్యం కానుంది.
వన్ ప్లస్ 6టీ లాంచింగ్ ఆఫర్లు : ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఈ డివైస్‌ను కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఈ ఫోన్‌ను కొన్న వారికి నో కాస్ట్ ఈఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.1వేయి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.
దీంతోపాటు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.5400 విలువగల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను 36 వోచర్ల రూపంలో జియో అందివ్వనుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు కోటక్ 811 అకౌంట్ తీసుకుంటే రూ.2వేల విలువైన యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
వన్‌ప్లస్ 6టీ ఫీచర్లు
6.41 ఇంచుల డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9.0 పై
6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్
16+20 ఎంపీడ్యుయల్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్ బ్యాటరీ
And there you have it! The OnePlus 6T starts at ₹37,999. Which one is your favourite variant? #OnePlus6TLaunch pic.twitter.com/RyovNwpfP3
— OnePlus India (@OnePlus_IN) October 30, 2018
Comments
Please login to add a commentAdd a comment