OnePlus 9, OnePlus 9 Pro To Get Massive Price Cut in India] - Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు...!

Published Wed, Apr 6 2022 4:44 PM | Last Updated on Wed, Apr 6 2022 5:41 PM

Oneplus 9 and Oneplus 9 Pro Receive a Price Cut of up to 10800 - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వనప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 10 ప్రోను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైన నేపథ్యంలో వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది వన్‌ప్లస్‌. 

వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లపై గరిష్టంగా రూ. 10 వేల వరకు తగ్గింపు  కొనుగోలుదారులకు అందబాటులో  ఉండనుంది. ఈ తగ్గింపు అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ అధీకృత రిటైల్ స్టోర్స్‌లో లభిస్తాయి. వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ 8జీబీ ర్యామ్‌, 12 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో రానుంది. 



వన్‌ప్లస్‌ 9 స్పెసిఫికేషన్లు

  • 6.55-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే    
  • స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్    
  • 48MP + 50MP + 2MP రియర్‌ కెమెరా
  • 16MP సెల్ఫీ కెమెరా
  • 65W ఛార్జింగ్‌ సపోర్ట్‌
  • 4,500mAh బ్యాటరీ

చదవండి: వాట్సాప్‌ సంచలన నిర్ణయం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement