ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో ఆధిపత్య చెలాయిస్తున్న శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వన్ ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ఫోన్‌ను పరిచయం చేయనుంది.
ఈ నెల 19న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 ఫోన్‌కు వన్ ప్లస్ గట్టి పోటీదారుగా నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్‌లో ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ధర ఎంతంటే
భారత మార్కెట్ లో విడుదల కానున్న వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,41,490 (1699 డాలర్లు) ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే వన్ ప్లస్ ఓపెన్ 7.8 అంగుళాల ఓపెన్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, కవర్ డిస్ ప్లే 6.3 అంగుళాలు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సౌకర్యం ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment