folding smartphone
-
వన్‌ప్లస్ నుంచి మడత ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో దీని ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో ఆధిపత్య చెలాయిస్తున్న శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వన్ ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఈ నెల 19న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 ఫోన్‌కు వన్ ప్లస్ గట్టి పోటీదారుగా నిలుస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో ‘వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్’ ధర ఎంతంటే భారత మార్కెట్ లో విడుదల కానున్న వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ.1,41,490 (1699 డాలర్లు) ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే వన్ ప్లస్ ఓపెన్ 7.8 అంగుళాల ఓపెన్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, కవర్ డిస్ ప్లే 6.3 అంగుళాలు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సౌకర్యం ఉండనుంది. -
ఐఫోన్ ఫ్లిప్ ఫోన్ వచ్చేస్తుంది!
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ మాదిరిగానే ఆపిల్ క్లామ్‌షెల్ లాంటి ఫ్లిప్ ఐఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ హ్యాండ్సెట్ చూడటానికి శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5జీ లాంటి డిజైన్ కలిగి ఉంటుంది. ఆపిల్ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ 2022 లేదా 2023లో రానున్నట్లు తాజా లీక్ పేర్కొంది. గతంలో వచ్చిన రూమర్ల ప్రకారం ఆపిల్ తీసుకురాబోయే మొదటి ఫ్లిప్ ఐఫోన్‌ను 2022 సెప్టెంబర్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఐఫోన్ ఫ్లిప్ మొబైల్ 5జీ సపోర్ట్ తో వస్తుందని భావిస్తున్నారు.(చదవండి: ఎక్స్ 60 ప్రోను లాంచ్ చేసిన వివో) యూట్యూబర్ జోన్ ప్రోస్సేర్ షేర్ చేసిన వీడియోలో ఆపిల్ చైనాలోని షెన్జెన్లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో క్లామ్‌షెల్ లాంటి ఐఫోన్ షెల్‌ను కంపెనీ పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోలో భవిష్యత్తులో ఆపిల్ తీసుకు రాబోయే ఫ్లిప్ ఐఫోన్ యొక్క కాన్సెప్ట్ ఇమేజ్ను పంచుకున్నారు. ఇది చూడటానికి శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌కు సమానంగా ఉంది. కానీ ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఈ రూమర్ ప్రకారం ఐఫోన్ తెరిచినప్పుడు పెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. అయితే బయటి షెల్‌లో కూడా చిన్న డిస్ప్లే కూడా ఉంటుందని తెలుస్తుంది. ఆపిల్, ఫ్లిప్ ఐఫోన్లో శామ్సంగ్ మాదిరిగా ఓఎల్ఈడీ డిస్ప్లే సిస్టం ఉంటుంది. మైక్రో ఎల్ఈడీ స్క్రీన్ ఉండదు. అయితే ఫ్లిప్ ఐఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ఆపిల్ ధ్రువీకరించలేదు. అలాగే గిజ్మో చైనా నివేదికల ప్రకారం.. ఆపిల్ ఫ్లిప్ ఐఫోన్ తీసుకొచ్చాక ఐప్యాడ్ మినీని నిలిపివేయనునట్లు సమాచారం. -
ఈ స్మార్ట్‌ఫోన్‌ను మడవొచ్చు..!
అభివృద్ధి చేస్తున్న శామ్సంగ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మడవగలిగే స్మార్ట్‌ఫోన్.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కొద్ది రోజుల్లో ఇది సాకారం కానుంది. టెక్నాలజీ దిగ్గజం శామ్సంగ్ దీనికోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అన్నీ అనుకూలిస్తే 2017లో ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తేవడానికి రెడీ అవుతోంది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఇచ్చిన విజయంతో కంపెనీ కొత్త కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగింది. ఓలెడ్ డిస్ప్లే సాంకేతిక పరిజ్ఞానంలో ఇటీవల వచ్చిన మార్పులు కంపెనీకి మార్గాన్ని సుగమం చేశాయి. సిల్వర్ నానోవైర్ ఆధారిత ఫ్లెక్సిబుల్ టచ్ డిస్ప్లే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు వాడుతున్నట్టు సమాచారం. ఫ్యాబ్లెట్స్, ట్యాబ్లెట్స్ను మడిచి జేబులో పెట్టుకునేలా రూపొందించేందుకు కంపెనీలకు ఈ టెక్నాలజీ దోహదం చేస్తుంది. ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ పేటెంటు కోసం యూఎస్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో (యూఎస్‌పీటీవో) శామ్సంగ్ దరఖాస్తు చేసింది. మే నెలాఖరులో పేటెంట్ అప్లికేషన్‌ను యూఎస్‌పీటీవో పబ్లిష్ చేసింది. ఇక ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు గెలాక్సీ ఎక్స్ అని తెలుస్తోంది. పనితీరు ఇతర స్మార్ట్ఫోన్ల మాదిరిగానే ఉం టుంది. ఆరు అంగుళాలు ఆపైన స్క్రీన్ ఉన్న ఫ్యాబ్లెట్, ట్యాబ్లెట్ సైతం జేబులో ఇట్టే ఇమిడిపోతుంది.