శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ మాదిరిగానే ఆపిల్ క్లామ్‌షెల్ లాంటి ఫ్లిప్ ఐఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ చూడటానికి శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5జీ లాంటి డిజైన్ కలిగి ఉంటుంది. ఆపిల్ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ 2022 లేదా 2023లో రానున్నట్లు తాజా లీక్ పేర్కొంది. గతంలో వచ్చిన రూమర్ల ప్రకారం ఆపిల్ తీసుకురాబోయే మొదటి ఫ్లిప్ ఐఫోన్‌ను 2022 సెప్టెంబర్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఐఫోన్ ఫ్లిప్ మొబైల్ 5జీ సపోర్ట్ తో వస్తుందని భావిస్తున్నారు.(చదవండి: ఎక్స్ 60 ప్రోను లాంచ్ చేసిన వివో)
యూట్యూబర్ జోన్ ప్రోస్సేర్ షేర్ చేసిన వీడియోలో ఆపిల్ చైనాలోని షెన్‌జెన్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో క్లామ్‌షెల్ లాంటి ఐఫోన్ షెల్‌ను కంపెనీ పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోలో భవిష్యత్తులో ఆపిల్ తీసుకు రాబోయే ఫ్లిప్ ఐఫోన్ యొక్క కాన్సెప్ట్ ఇమేజ్‌ను పంచుకున్నారు. ఇది చూడటానికి శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌కు సమానంగా ఉంది. కానీ ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఈ రూమర్ ప్రకారం ఐఫోన్ తెరిచినప్పుడు పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే బయటి షెల్‌లో కూడా చిన్న డిస్‌ప్లే కూడా ఉంటుందని తెలుస్తుంది. ఆపిల్, ఫ్లిప్ ఐఫోన్‌లో శామ్‌సంగ్ మాదిరిగా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే సిస్టం ఉంటుంది. మైక్రో ఎల్‌ఈడీ స్క్రీన్ ఉండదు. అయితే ఫ్లిప్ ఐఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ఆపిల్ ధ్రువీకరించలేదు. అలాగే గిజ్మో చైనా నివేదికల ప్రకారం.. ఆపిల్ ఫ్లిప్ ఐఫోన్ తీసుకొచ్చాక ఐప్యాడ్ మినీని నిలిపివేయనునట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment