చాలా రోజులుగా ఊరిస్తున్న వన్ ప్లస్ 11 (OnePlus 11) కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్‌ను తాజాగా ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ఫీచర్‌ను ఇందులో తీసుకొచ్చింది. అదే యాక్టివ్ క్రియోఫ్లక్స్ కూలింగ్ సొల్యూషన్. ఈ యాక్టివ్ క్రియోఫ్లక్స్ అనేది సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లలో ఉండే క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌కి మరో పేరు. కానీ దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనువుగా రూపొందించారు.
ఫోన్ మధ్యలో ఒక సిరామిక్ పైజోఎలెక్ట్రిక్ మైక్రోపంప్ ఉంటుంది. ఇది చిన్నచిన్న గొట్టాల ద్వారా కూలింగ్ ద్రవాన్ని ఫోన్ అంతటికీ పంపుతుంది. ఇది రేడియేటర్‌గా పనిచేసి ఫోన్ హీట్‌ను గ్రహించి చల్లబరుస్తుంది. ఈ యాక్టివ్ క్రయోఫ్లక్స్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ ఉష్ణోగ్రతలను 2.1 డిగ్రీల వరకు తగ్గించగలదని వన్ ప్లస్ పేర్కొంది. ఇది ఛార్జింగ్ సమయంలోనే ఉష్ణోగ్రతను 1.6 డిగ్రీలకు తగ్గిస్తుంది. దీంతో ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది.
(ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?)
ఇక మిగిలినవి ఫోన్ డిజైన్ ఇతర ఆకృతులకు సంబంధించినవి. ఫోన్ వెనుక కవర్ కోసం వంపు తిరిగిన, పారదర్శక గాజును ఉపయోగించారు. దీంతో వెనుకవైపు కూలింగ్ ద్రవం ప్రవహించే ప్రకాశవంతమైన గొట్టాలను చూడవచ్చు. అలాగే కెమెరా చుట్టూ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.
అయితే వన్ ప్లస్ ఈ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిని ఎప్పుడు మొదటు పెడుతుందో స్పష్టత లేదు. ఇలాగే 2020లో వన్‌ప్లస్ ఆసక్తికరమైన సెల్ఫ్-టింటింగ్ కెమెరా కవర్ క్లాస్‌ను ఆవిష్కరించింది. కానీ వాటిని ఉత్పత్తి చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment