వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా తీసుకొని రానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ జూన్ 10న తన సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో కొత్త వన్‌ప్లస్ టీవీ యు-సిరీస్ మోడళ్ తో పాటు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ గతంలో యూరప్, ఉత్తర అమెరికాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 5జీని పోలి ఉంటుందని తెలుస్తుంది.
రాబోయే బడ్జెట్ ఫోన్ గురించి మరికొన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ చేత పనిచేయనున్నట్లు ఆండ్రాయిడ్ సెంట్రల్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ పేరులో సీఈ అంటే కోర్ ఎడిషన్ అని అర్ధం. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుందని సమాచారం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 10న సాయంత్రం 7 గంటలకు వన్‌ప్లస్ టీవీ యు సిరీస్‌తో పాటు లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 11 నుంచి ప్రీ-ఆర్డర్ కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 16 నుంచి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఓపెన్ సేల్ కి వస్తుంది.
చదవండి: పన్ను చెల్లింపుదారుల గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment