Amazon Fab Phones Fest 2021: Amazon Fab Top Phones Fest Top Smartphones Up to 40% Discount - Sakshi
Sakshi News home page

Amazon: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లపై అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌..! ఏకంగా 40 శాతం...!

Published Wed, Nov 24 2021 5:11 PM | Last Updated on Wed, Nov 24 2021 6:02 PM

Amazon Fab Top Phones Fest Top Smartphones Up To 40 Discount - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో సేల్‌ను ప్రకటించింది. ‘ఫాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ ’పేరుతో పలు స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ ఆఫర్లను లాంచ్‌ చేసింది. ఈ సేల్‌లో భాగంగా షావోమీ, శాంసంగ్‌, వన్‌ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై, మొబైల్‌ ఉపకరణాలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. ఈ సేల్‌ నవంబర్‌ 24 నుంచి ప్రారంభమై నవంబర్‌ 28తో ముగియనుంది. 
చదవండి: షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో, వివో..!

‘ఫ్యాబ్‌ ఫోన్‌ ఫెస్ట్‌’లో పలు స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ అందిస్తోన్న ఆఫర్స్‌లో కొన్ని...!

షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ 5జీ: 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ. 26,999 ఉండగా ఈ సేల్‌లో భాగంగా రూ. 19999కే కొనుగోలుదారులకు లభించనుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ:  8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ. 39,990 ఉండగా ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ సేల్‌లో భాగంగా రూ. 38, 740కు రానుంది. 

వన్‌ప్లస్‌ 9ప్రో: ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు రూ. 54,999 లభించనుంది. అంతేకాకుండా అమెజాన్‌ కూపన్‌ను కూడా పొందవచ్చును.

ఐక్యూ జెడ్‌5 5జీ: 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ. 20,615కే కొనుగోలుదారులకు లభించనుంది.

ఐక్యూ జెడ్‌3 5జీ: ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు రూ. 17,865 కే లభించనుంది.

షావోమీ ఎమ్‌ఐ 11ఎక్స్‌ 5జీ: ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌, ఎస్‌బీఐ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 21,749 కే రానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌12: బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ లిస్ట్‌లో  ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 10,349కు కొనుగోలుదారులకు లభించనుంది. 

చదవండి: ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలపై నిషేధం! త్వరలో ప్రభుత్వ రంగంలో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement