
మీ ఫోన్ పనిచేయకపోతే ఏం చేస్తారు? ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లోకి లేదా స్టోర్‌లోకి వెళ్లి వేరే ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఓ వ్యక్తి ఒక్క అడుగు ముందుకేశాడు. తన ఫోన్‌కు రీబూట్ సమస్య ఉందని, తనకు వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలంటూ ఏకంగా కంపెనీ కో-ఫౌండర్ కార్ల్ పీకే ఈమెయిల్ చేశాడు. ఈ ఈ-మెయిల్‌ను స్క్రీన్ షాట్ తీసిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు, దాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ పోస్టుకు ట్విట్టర్‌లో అనూహ్య స్పందన వస్తోంది. క్రిష్ణకుమార్ వీ పేరుతో కార్ల్‌కు ఈ-మెయిల్ వచ్చింది.
''5టీ గురించి వినడం ఆనందదాయకంగా ఉంది. త్వరగా నాకు ఒకటి పంపండి. నా వన్‌ప్లస్ వన్‌కు రీబూట్ సమస్య వచ్చింది. వెంటనే నాకు వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ ఇవ్వండి. మీ విజయాన్ని అంచనావేయడానికి నేనే మొదటి వ్యక్తిని. నేనే ఈ సహజసిద్ధమైన హక్కును కలిగి ఉంది'' అనే సబ్జెట్‌తో అక్టోబర్ 11న ఈ మెయిల్‌ను పంపాడు. ప్రపంచంలో తొలి ఫ్యాన్‌గా పేర్కొంటూ ఈ ఈ-మెయిల్‌ను పంపాడు. ఆశ్చర్యకరంగా ఈ ఈ-మెయిల్‌ను స్క్రీన్‌షాట్ చేసిన కార్ల్ పీ 1.2 లక్షల మంది ఫాలో అయ్యే తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కార్ల్ పీ పోస్టు చేసిన ఈ పోస్టుకు విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.
ఇటీవలే వన్‌ప్లస్ 5టీ ను కంపెనీ లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 5ను లాంచ్‌చేసిన నెలల వ్యవధిలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చాలా మంది ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం ఓ డ్రీమ్‌గా భావిస్తున్నారు. నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అందుబాటులోకి వస్తోంది. విక్రయానికి రావడానికి ఒక నెల ముందే ఆ యూజర్, కో-ఫౌండర్‌కు ఈమెయిల్ చేశాడు.
Natural right 🤦♂️ pic.twitter.com/0HTuh2zAYu
— Carl Pei (@getpeid) November 18, 2017
If you're immediate granting 5T's, I'll have one too
— Boj (@OliverBoj) November 18, 2017
IMMEDIATELY GRANT ME 5T
— Matthew Sigmond (@matthew28845) November 19, 2017
typical Indian user go have a look at the forums...
— Darren Powell (@Darrenintruder) November 18, 2017
My oneplus one doesn't have boot issues, but can I claim an 'artificial right' since natural right has been claimed already?
— Viswanath G (@viswanathksg) November 19, 2017
LMFAO hahaha 🤣🤣🤣. Well the amount of coverage I have given to OnePlus products over the last few years, I think I have a stronger right @getpeid lol 🤣🤣🤣🤣
— J TheAndroidFreak (@cjunaid3) November 18, 2017