వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్ | OnePlus 9 RT Tipped to Launch on October 15th | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్

Published Tue, Sep 14 2021 6:25 PM | Last Updated on Tue, Sep 14 2021 6:27 PM

OnePlus 9 RT Tipped to Launch on October 15th - Sakshi

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ త్వరలో 9 ఆర్‌టీ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ తీసుకొని రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర స్పెసిఫికేషన్లను కొందరు టిప్ స్టార్ హీరోలు బయటకి లీక్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చే నెల అక్టోబర్ మధ్యలో లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చివరి స్మార్ట్‌ఫోన్‌ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమెన స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు తెలుస్తుంది.

వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ అక్టోబర్ 15న లాంచ్ కానున్నట్లు ప్రముఖ టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్(@onleaks) ట్వీట్ చేశారు. దీనిని వన్‌ప్లస్‌ ధృవీకరించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ 8జీబీ + 128జీబీ వేరియెంట్ ధర సీఎన్‌వై 2,999(సుమారు రూ.34,300), 8జీబీ + 256జీబీ వేరియెంట్ ధర సీఎన్‌వై 3,299(సుమారు రూ.37,700)కు విడుదల కావచ్చు అని తెలుస్తుంది.(చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం)

వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ ఫీచర్స్(అంచనా)

  • 6.55 అంగుళాల శామ్ సంగ్ ఈ3 ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే (120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు) 
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 
  • స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్
  • 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్
  • 50 ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 766 సెన్సార్ ట్రిపుల్ సెటప్ కెమెరా 
  • 65డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ 
  • 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement