
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ తన యూజర్లకు భారీ షాక్‌నిచ్చింది. భారత మార్కెట్‌లో టీవీలకు ఉన్న గిరాకీని కంపెనీ క్యాష్ చేసుకోవడం కోసం టీవీల మార్కెట్‌లోకి దిగిన విషయం తెలిసిందే. తాజాగా వన్‌ప్లస్ తీసుకున్న నిర్ణయంతో కొనుగోలుదారుల జేబులకు చిల్లుపడనుంది. వన్‌ప్లస్ తన టీవీ ధరలను గణనీయంగా పెంచింది. సుమారు వన్‌ప్లస్ టీవీ శ్రేణిల్లో ఆరు మోడళ్ల కొత్త ధరలను ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి.
వన్ ప్లస్ టీవీ 32ఇంచ్‌వై1మోడల్‌ను 2 వేలు పెంచి రూ.18,999లుగా, టీవీ40వై1మోడల్‌ను రూ.2,500 పెంచి రూ.26,499లుగా, టీవీ43వై1 మోడల్‌ను రూ.2500 పెంచి కొత్త ధరను రూ.29,499లుగా, టీవీ 50యూ1ఎస్ మోడల్‌ను ఏకంగా రూ. 7000 పెంచి కొత్త ధర 46,999గా. టీవీ 55యూ1ఎస్ మోడల్‌ను రూ. 5000 పెంచి కొత్త ధరను రూ.52,999లుగా, టీవీ 65యూ1ఎస్ మోడల్‌ను రూ.6000 పెంచిన కొత్త ధరను రూ.68,999లుగా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment