
సాక్షి,ముంబై: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్‌కుచెందిన స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరలో లభ్యమవుతోంది. త్వరలోనే ఈ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో ఇండియాలో 5 వేల రూపాయల తగ్గింపుతో అందిస్తోంది.
వన్‌ప్లస్ 10 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇండియా లాంచింగ్ ప్రైస్ రూ. 66,999. కాగా ప్రస్తుతం 5,000 ధర తగ్గింపుతో రూ. 61,999లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 66,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో ఇది లభ్యం. దీంతోపాటు వన్‌ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60,999 కే లభిస్తోంది.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు
6.7 అంగుళాల QHD+ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 13
48+ 50+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాటరీ
మరోవైపు వన్‌ప్లస్ 10కి కొనసాగింపుగా వన్‌ప్లస్ 11 స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌లో చైనాలో లాంచ్ కానుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment