ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మొబైల్ మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ తీసుకోని వచ్చేందుకు సిద్దం అయ్యింది. వన్‌ప్లస్ 9ఆర్ టీ మొబైల్ చైనాలో లాంచ్ కు సిద్దంగా ఉంది అని సమాచారం. చైనా కంపెనీ తన 'టి' సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ పై పనిచేస్తున్నట్లు ఒక కొత్త నివేదిక పేర్కొంది. ఈ వన్‌ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్‌ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.(చదవండి: హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా?)
వన్‌ప్లస్ 9ఆర్ టీ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 120హెర్ట్జ్ ఆమో ఎల్ఈడీ ప్యానెల్, 65డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉండనుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ గల ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12తో వచ్చిన మొదటి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావచ్చు అని నివేదిక పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ మన దేశంలో రాబోయే అక్టోబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment