OnePlus Launches 43 Y1S Pro Smart TV In India, Check Full Details Inside - Sakshi
Sakshi News home page

అద్భుతమైన ఫీచర్స్.. కొత్త స్మార్ట్‌ టీవీ లాంచ్ చేసిన వన్ ప్లస్

Published Wed, Apr 13 2022 7:24 AM | Last Updated on Wed, Apr 13 2022 10:17 AM

OnePlus launches new smart TV - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ టీవీల విభాగంలో 2020తో పోలిస్తే 2021లో 350 శాతం వృద్ధి సాధించినట్టు టెక్నాలజీ కంపెనీ వన్‌ప్లస్‌ ప్రకటించింది. ‘2019లో భారత్‌లో టీవీలను పరిచయం చేశాం. 2021 నాల్గవ త్రైమాసికంలో అతిపెద్ద స్మార్ట్‌ టీవీ బ్రాండ్లలో టాప్‌–5లో చోటు సంపాదించాం’ అని కంపెనీ ప్రకటించింది.

తాజాగా భారత్‌లో 43 వై1ఎస్‌ ప్రో టీవీని వన్‌ప్లస్‌ ప్రవేశపెట్టింది. ఆధునీకరించిన 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లేతో 43 అంగుళాల తెర, చిత్రం స్పష్టత కోసం ఎంఈఎంసీ సాంకేతికత, వేగవంతమైన గేమింగ్‌ అనుభూతికి ఆటో లో లేటెన్సీ మోడ్, వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్, బడ్స్, వాచ్‌ కనెక్టివిటీ, డాల్బీ ఆడియో వంటి హంగులు ఉన్నాయి. వైఫై, డేటా కనెక్షన్‌ లేనప్పటికీ వన్‌ప్లస్‌ కనెక్ట్‌ 2.0 ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో టీవీని ఆపరేట్‌ చేయవచ్చు. ధర రూ.29,999 ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement