న్యూఢిల్లీ : పలు లీక్‌లు, టీజర్ల అనంతరం వన్‌ప్లస్ భారత మార్కెట్లో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8ప్రోలను లాంఛ్ చేసింది. అందుబాటు ధరలో అత్యాధునిక మోడల్స్‌ను భారత్ మార్కెట్‌లో లాంఛ్ చేసినట్టు ఒన్‌ప్లస్ పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇవి త్వరలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. వన్‌ప్లస్ 8 రూ 41,999, వన్‌ప్లస్ 8 ప్రో రూ 54,999, బుల్లెట్స్ వైర్‌లెస్ జడ్ రూ 1999కు లభిస్తాయని పేర్కొంది.
కొత్త ఆక్సిజన్ ఓఎస్ ఫీచర్లు స్మూత్ బాటిల్ 2.0, న్యూ డార్క్ థీమ్, డైనమిక్ వాల్ పేపర్స్, లైవ్ క్యాప్షన్, అమెజాన్ అలెక్సా స్మార్ట్ అసిస్టెంట్, అలెక్సా హ్యాండ్స్-ఫ్రీ, యాప్ గ్యాలరీ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లను అధునాతనంగా అందించినట్టు కంపెనీ వెల్లడించింది.వన్‌ప్లస్ 8 బ్లాక్, గ్లేసియల్ గ్రీన్, గ్లాసీ, పోలార్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6.55 అంగుళాల అమోల్డ్ ఎల్ఈడీ డిస్‌ప్లే, త్రీడీ గొరిల్లా గ్లాస్‌తో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుంది. ఇక వన్‌ప్లస్ 8 ప్రో బ్లాక్, గ్లేసియల్ గ్రీన్, అల్ర్టామెరైన్ బ్లూ కలర్స్‌లో 6.78 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్‌తో అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 8 ప్రో 4510 ఎంహెచ్‌ఏ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment