దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్ 50 ఫ్యూజన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్‌లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్‌మల్లౌ బ్లూ కలర్‌వేస్‌లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.
లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్‌లు) pOLED కర్వ్డ్ డిస్‌ప్లే పొందుతుంది. ఇది క్వాల్‌కామ్ 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై-6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment