వన్‌ప్లస్ ఫిట్‌నెస్ బ్యాండ్ మార్కెట్ లోకి జనవరి 11న రానున్నట్లు ముకుల్ శర్మ, ఇషాన్ అగర్వాల్ టిప్‌స్టర్‌లు పేర్కొన్నారు. వన్‌ప్లస్ ఇండియా ఫిట్‌నెస్ బ్యాండ్ అధికారిక పేరు, ప్రత్యేకతలు ప్రకటించకుండా కేవలం టీజర్ చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకుంది. ఈ చిత్రంలో 'ది న్యూ ఫేస్ ఆఫ్ ఫిట్‌నెస్'తో పాటు 'కమింగ్ సూన్' కూడా ఉంది. ఫిట్‌నెస్ బ్యాండ్ యొక్క ప్రత్యేక వెబ్‌సైట్‌లో 'నోటిఫై మీ' అనే వివరాలతో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. టిప్‌స్టర్‌లు తెలిపిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ బ్యాండ్ జనవరి 11న రూ.2,499 లభించనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: రేపే షియోమీ ఎంఐ 10ఐ లాంచ్)
వన్‌ప్లస్ బ్యాండ్ ఫీచర్స్:
యూట్యూబ్‌లో ముకుల్ శర్మ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. వన్‌ప్లస్ బ్యాండ్ లో 1.1-అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ప్లే, 24x7 హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 బ్లడ్ సాచురేషన్ మానిటరింగ్, 3-యాక్సిస్ యాక్సిలెరో మీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ 5.0, ఐపి 68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటివి ఉన్నాయి. వన్‌ప్లస్ బ్యాండ్ కూడా 50 మీటర్ల లోతు వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉన్న 100 ఎంఏహెచ్ బ్యాటరీతో 14 రోజుల వరకు పనిచేస్తుందని తెలుపుతున్నారు. ఇది 10.3 గ్రాముల బరువు ఉంటుంది(ట్రాకర్ మాత్రమే). ఇది బ్లాక్, నేవీ, టాన్జేరిన్ గ్రే అనే మూడు రంగులలో లభిస్తుంది. వన్‌ప్లస్ నుంచి రానున్న మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను కూడా ఈ సంవత్సరంలోనే లాంచ్ చేయనున్నట్లు సంస్థ సీఈఓ పీట్ లా గత నెలలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment