
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఎట్టకేలకు తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 5టీని న్యూయార్క్ వేదికగా లాంచ్ చేసింది. అతిపెద్ద స్క్రీన్, మెరుగైన కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో 64 జీబీ వేరియంట్ ధర రూ.32,999 కాగ, 128జీబీ వేరియంట్ ధర 37,999 రూపాయలు. నవంబర్ 21 సాయంత్రం 4:30 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పైకి విక్రయానికి వస్తోంది. అన్ని సేల్స్ ఛానల్స్ ద్వారా ఈ డివైజ్ త్వరలోనే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్.. సామ్‌సంగ్, యాపిల్, ఎల్‌జీ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు నెక్ టు నెక్ కాంపిటీటర్‌గా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వన్‌ప్లస్ 5టీ ఫీచర్లు..
6 అంగుళాల అప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే
ప్రొటెక్షన్ కోసం గొర్రిల్లా గ్లాస్ 5
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆక్సీజెన్‌ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌తో రన్నింగ్
రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్ సెన్సార్, రెండోది 16 మెగాపిక్సెల్ మోడ్యూల్
ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా
తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ స్కానర్