సాక్షి, ముంబై: ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌పోన్ల సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో వన్‌ప్లస్ 9 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌లను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు వన్‌ప్లస్ ప్రకటించింది.
వన్‌ప్లస్ 9 ఫీచర్లు
6.70 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 11
1440x3216 పిక్సెల్స్ రిజల్యూషన్
8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
48+ 50+2 ఎంపీ రియర్ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
వన్‌ప్లస్ 9 ప్రో ఫీచర్లు
6.7 అంగుళాల డిస్‌ప్లే
1440x3216 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 11
8 జీబీ + 128 జీబీ స్టోరేజ్
48+ 50+8+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్పీకెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ ,వైర్‌లెస్‌చార్జర్
ధరలు
వన్‌ప్లస్ 9 ధర రూ .39,999 నుంచి ప్రారంభం. 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో 43,999 కార్బన్ బ్లాక్ లేక్ బ్లూ రంగులతో వస్తుంది
వన్‌ప్లస్ 9 ప్రో ధర 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌కు రూ .64,999 . హై ఎండ్ మోడల్‌కు 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .69,999గా ఉంది. పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ మార్నింగ్ మిస్ట్ రంగులలో వస్తుంది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా లభ్యం. ఏప్రిల్ 1 , 15 తేదీల్లో తొలి సేల్ ఉంటుంది.
ఆఫర్లు
ఎస్‌బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వ న్‌ప్లస్ 9 ఆర్‌పై వరుసగా రూ .4,000, రూ .3,000 రూ .2,000 తగ్గింపు. దీంతోపాటు పరిచయ ఆఫర్ గా స్మార్ట్‌వాచ్ ను 14వేల,999 రూపాయలకే అందించనుంది.
వన్‌ప్లస్ స్మార్ట్ వాచ్:
ఈ స్మార్ట్‌ఫోన్లతో పాటు వన్‌ప్లస్ స్మార్ట్ వాచ్‌ను కూడా రిలీజ్ చేసింది. 1.39 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేతో వస్తున్న స్మార్ట్ వాచ్ ధర రూ. 16,999గా నిర్ణయించింది. హ్యాండ్స్ ఫ్రీ కాల్స్, యాప్ నోటిఫికేషన్లు, ఫోన్ సెట్టింగులను సర్దుబాటు చేయడం, ఫోటో గ్యాలరీని యాక్సెస్ కెమెరా షట్టర్ రెగ్యులేటరీ లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అ లాగే వర్కౌట్ డిటెక్షన్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ మానిటర్, స్ట్రెస్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో పని చేసే ఈ స్మార్ట్ వాచ్‌ని 20 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే. 7 రోజులు వస్తుందని వన్‌ప్లస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment