రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు: ఇక్కడ చూడండి | Best Smart Phones Under Rs 6000 in India Infinix Smart 8 Itel Aura 05i and Redmi A2 | Sakshi
Sakshi News home page

రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు: ఇక్కడ చూడండి

Published Sun, Nov 17 2024 9:04 PM | Last Updated on Sun, Nov 17 2024 9:11 PM

Best Smart Phones Under Rs 6000 in India Infinix Smart 8 Itel Aura 05i and Redmi A2

ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ల దగ్గర నుంచి రూ. 6వేలు ధర వద్ద లభించే ఫోన్‌ల వరకు ఉన్నాయి. ఈ కథనంలో ఆరువేల రూపాయల ధర వద్ద లభించే స్మార్ట్‌ఫోన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8)
మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8' ధర కేవలం రూ.6,699 మాత్రమే. బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే. ఇది రూ. 6వేలకు లభిస్తుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, రెండు కెమెరాలు మొదలైనవి ఉంటాయి. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ పొందుతుంది.

ఐటెల్ ఆరా 05ఐ (Itel Aura 05i)
రూ.6000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఐటెల్ ఆరా 05ఐ ఒకటి. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. దీని ధర రూ. 5749 మాత్రమే. మల్టిపుల్ కెమెరా ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు.

రెడ్‌మీ ఏ2 (Redmi A2)
రూ.5669 వద్ద లభించే రెడ్‌మీ ఏ2 కూడా ఆరు వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement