ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అక్టోబర్ 3 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లపై, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు సంబంధించిన ఆఫర్లను, క్యాష్‌బ్యాక్ అమెజాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో టీజ్ చేస్తోంది. తాజాగా వన్‌ప్లస్ 9, 9 ప్రో మోడళ్లపై కొనుగోలుదారులకు భారీ తగ్గింపుతో అమెజాన్ అందించనుంది. అందుకు సంబంధించిన ఆఫర్‌ను అమెజాన్ తాజాగా టీజ్ చేసింది.
చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..!
వన్‌ప్లస్ 9 ప్రో సుమారు 50 వేల కంటే తక్కువ ధరలో, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ 40 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుదారులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో లభించనుంది. వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ధర రూ. 64,999 కాగా, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ధర రూ. 54,999 గా ఉంది.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 9, 9 ప్రో వేరియంట్లపై వరుసగా పదివేలు, 15 వేల డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12జీబీ, 256జీబీ వేరియంట్లలో వన్‌ప్లస్ 9 ప్రో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ 9 వేరియంట్ 8జీబీ, 12 జీబీ ర్యామ్స్‌తో కూడా లభించనున్నాయి.
చదవండి: ఒక్కసారిగా పేలిన ఫోన్ ఛార్జర్...! స్పందించిన కంపెనీ...!
Amazon : వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు...!
Published Tue, Sep 28 2021 9:21 PM | Last Updated on Wed, Sep 29 2021 8:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment