కరోనా కారణంగా గేమింగ్ ఇండస్ట్రీ జోరందుకుంది.అయితే వారికి అనుగుణంగా ఆయా టెక్ సంస్థలు పలు గాడ్జెట్స్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా గేమింగ్ ప్రియులు వినియోగించేందుకు వీలుగా చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ 'వన్‌ప్లస్ బడ్స్ ప్రో'ను మన దేశంలో విడుదల చేసింది.
వన్‌ప్లస్ బడ్స్ ప్రో ఫీచర్స్
తాజాగా విడుదలైన ఈ వన్ ప్లస్ బడ్స్ ప్రోను వినియోగించే సమయంలో చుట్టుపక్కల నుంచి వచ్చే డిస్టబెన్స్ లేకుండా, ఒత్తిడి తగ్గించేందుకు జెన్ మోడ్ ఎయిర్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు వైర్ లెస్ ఛార్జింగ్, 1 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ బరువున్న ఏ వస్తువు ఈ ఇయర్ బర్డ్ పై పడినా.. ఎలా డ్యామేజీ కలగకుండా ఉండే (ఐపీ - 44 సర్టిఫికేషన్ ) ఫీచర్ తో డిజైన్ చేశారు.
యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్, సౌండ్ ను ప్రొడ్యూస్ చేసే 11ఎంఎం మ్యాగ్నెటిక్ డైనమిక్ డ్రైవర్లు, హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్‌సీ), మూడు ఏఎన్‌సీ మోడ్‌లుతో పాటు ఎక్స్‌ట్రీం, ఫెయింట్, స్మార్ట్ మోడ్‌లో ఏఎన్‌సీ వినియోగించుకునే సౌకర్యం ఉంది. బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ, 38 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుండగా..10 నిమిషాల చార్జింగ్ పెడితే.. 10 గంటల ప్లేబ్యాక్‌ను ఇవి అందించనున్నారు.
వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర
గ్లాసీ వైట్, మాట్ బ్లాక్ రంగుల్లో ఉండే ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర రూ.9,990గా నిర్ణయించారు. ఆగస్ట్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్ సైట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చని వన్ ప్లస్ ప్రతినిధులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment