వన్‌ప్లస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్ విడుదల అవుతుందా అని మొబైల్ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మొబైల్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9ప్రోకి చెందిన ఫోటోలు బయటకి విడుదలయ్యాయి. వనిల్లా వన్‌ప్లస్ 9ప్రోకి చెందిన చిత్రాలను యూట్యూబర్ డేవ్2డి లీక్ చేసాడు. లీకైన ఫోటోలను బట్టి చూస్తే మనకు వన్‌ప్లస్ 9ప్రో వెనుక కెమెరాలో రెండు ప్రధాన కెమెరాలతో పాటు, మరో రెండు ఇతర చిన్న కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో టెలిఫోటో కెమెరాగా కనిపిస్తుంది.
వన్‌ప్లస్ ఈ సారి ప్రధానంగా కెమెరా మీద దృష్ట్టి పెట్టినట్లు కనిపిస్తుంది. చాలా మంది వినియోగదారులు వన్‌ప్లస్ ప్రధానంగా కెమెరా విషయంలో ఇతర మొబైల్ ఫోన్ తో పోలిస్తే వెనుకబడినట్లు పేర్కొంటున్నారు. వన్‌ప్లస్ 9ప్రో డిస్ప్లే సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ నాచ్ కటౌట్ కలిగి ఉంది, దీని స్క్రీన్ QHD+(3120x1440 పిక్సెల్స్) రిజల్యూషన్ తో 120హెర్ట్జ్ అధిక రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఆసక్తికరం విషయం ఏంటంటే దీనిలో ఏ ప్రాసెసర్ తీసుకొస్తున్నారో బయటకి వెల్లడించలేదు. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తున్నట్లు సమాచారం. దీనిని ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో తీసుకొనిరానున్నారు.(చదవండి: పోకో ప్రియులకు శుభవార్త!)
Comments
Please login to add a commentAdd a comment