
భారత్- చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలనే ప్రచారం గత కొన్ని రోజులుగా ఊపందుకుంది. ముఖ్యంగా చైనా ఫోన్లను బహిష్కరించాలని, భారతదేశపు వస్తువులను ప్రోత్సహించాలని క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. మేక్‌ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ నినాదాలు హోరెత్తుతున్నాయి. దీంతో చైనా కంపెనీలకు నష్టాలు తప్పవని అంతా భావించారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం చైనా కంపెనీ బీబీకె ఎలక్ట్రానిక్స్ విడుదల చేసిన వన్‌ప్లస్ 8 ప్రో హాట్ కేక్‌లాగా అమ్ముడైపోయింది. దీనికి తోడు తమకు ఫోన్ దొరకలేదని, అందుబాటులోకి మరిన్ని ఫోన్లను తీసుకురావాలని కూడా ట్విట్టర్ వేదికగా కొందరు కంపెనీని కూడా కోరారు. (పబ్జీ గేమ్ చైనాదేనా?)
దీంతో చైనా వస్తువుల వినియోగం ఇప్పటికీ దేశంలో బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాదికి చైనాకు ఇండియా నుంచి రూ. 3.8 లక్షల కోట్ల ఆదాయం లభిస్తోంది. చైనా ఫోన్లతో సెక్యూరిటీ సమస్య ఉందని, వాటిని బహిష్కరించాలనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో ఇండియా కంపెనీలు లాభపడతాయని అంతా భావిస్తున్నారు. ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment