సాక్షి, ముంబై : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 8 అమ్మకాలను ఇండియాలో మరోసారి ప్రారంభించనుంది. అమెజాన్ , వన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది..
వన్‌ప్లస్ 8 స్పెసిఫికేషన్లు :
6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డి +ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 5జీ, స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 48 +16+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 టి సపోర్టింగ్ టైప్-సి పోర్ట్ లాంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.
ధరలు
6 జీబీ ర్యామ్ /128 స్టోరేజ్ ధర రూ.41,999
8 జీబీ ర్యామ్ /128 స్టోరేజ్ ధర రూ.44,999
12 జీబీ ర్యామ్ /256 జీబీ ధర రూ 49,999
సేల్ ఆఫర్లు: అమెజాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్లకు రూ .2000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై అమెజాన్ పే బ్యాలెన్స్‌గా అదనంగా రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, అన్ని ప్రధాన బ్యాంకులలో చెల్లుబాటు అయ్యేలా వడ్డీ లేని 12 నెలల వాయిదాల పథకం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment