లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్, ధర | OnePlus 9 Lite with Snapdragon 865 will Join the 9 and 9 Pro next Year | Sakshi
Sakshi News home page

లీకైన వన్‌ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్, ధర

Published Thu, Dec 24 2020 7:05 PM | Last Updated on Thu, Dec 24 2020 7:17 PM

OnePlus 9 Lite with Snapdragon 865 will Join the 9 and 9 Pro next Year - Sakshi

వన్‌ప్లస్ 9 సిరీస్ లో రాబోయే స్మార్ట్ ఫోన్స్ ను సంస్థ 2021 తొలి త్రైమాసికంలో తీసుకు రాబోతున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 9 సిరీస్ లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోతో పాటు వన్‌ప్లస్ 9 లైట్‌ అనే మొబైల్స్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వన్‌ప్లస్ 9కి సంబందించిన ఫీచర్స్, ధర లీక్ అయ్యాయి. 91 మొబైల్స్ వెబ్ సైట్ తెలిపిన సమాచారం మేరకు వన్‌ప్లస్ 9 మొబైల్ లో కార్నర్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరాతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ను చేయనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్)   

వన్‌ప్లస్ 9 సిరీస్ లో భాగంగా రాబోయే వన్‌ప్లస్ 9 ప్రో మొబైల్ 30 వాట్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మొట్ట మొదటి వన్‌ప్లస్ మొబైల్ ఇదే కావచ్చు. వన్‌ప్లస్ 9 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వనిల్లా వన్‌ప్లస్ 9 కూడా 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ వన్‌ప్లస్ 9 మొబైల్ లో కంటే వన్‌ప్లస్ 9 ప్రో మోడల్‌లో ప్రీమియం ఫీచర్లను తీసుకురానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 9 మరియు వన్‌ప్లస్ 9 ప్రో రెండూ లైకా బ్రాండెడ్ కెమెరాలతో వస్తాయని గత నివేదికలు తెలియజేస్తున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 9 మొబైల్ లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 20ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపీ టెలిఫోటో కెమెరాతో వస్తుందని సమాచారం. ఈ రెండు మొబైల్స్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్ ద్వారా పనిచేయనున్నాయి. అలాగే వన్‌ప్లస్ 9 లైట్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 లైట్ ధర 600 డాలర్లు(సుమారు రూ.44,200) కాగా వన్‌ప్లస్ 9 ధర 700-800 డాలర్లు(సుమారు 51-58 వేలు), వన్‌ప్లస్ 9 ధర సుమారు 60 వేల నుండి 70 వేల మధ్య ఉండనున్నట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement