రియల్‌మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్ | Realme 8 5G, Realme 8 Pro 5G India launch expected soon | Sakshi
Sakshi News home page

రియల్‌మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్

Published Tue, Apr 6 2021 8:45 PM | Last Updated on Tue, Apr 6 2021 10:23 PM

Realme 8 5G, Realme 8 Pro 5G India launch expected soon - Sakshi

ప్రముఖ చైనా స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుస స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీదుంది. రియల్‌మీ ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియల్​ మీ8, 8 ప్రోల​ను గత నెలలో చైనాలో లాంఛ్​ చేసింది. అతి త్వరలోనే వీటిలో 5జీ కనెక్టివిటీ అందించి భారత మార్కెట్​లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవలే, ఈ రెండు ఫోన్లు ఎఫ్‌సిసి, బిఐఎస్ సర్టిఫికేషన్​ను సాధించడంతో అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లలో అందిస్తున్న స్పెసిఫికేషన్లు వివరాలను పరిశీలిస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి.

రియల్ మీ 8 స్పెసిఫికేషన్లు(అంచనా):

  • 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే  
  • మీడియాటెక్​ హీలియో జి95 ప్రాసెసర్ 
  • డ్యూయల్ సిమ్ సపోర్ట్ 
  • 64 ఎంపి ప్రైమరీ సెన్సార్​ 
  • 8 ఎంపి అల్ట్రా వైడ్​ యాంగిల్​ లెన్స్​ 
  • 2 ఎంపి మాక్రో లెన్ష్​ కెమెరా
  • 2 ఎంపి లెన్స్​ కెమెరా
  • 16 ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యుఐ 2.0
  • రియల్​మీ 8​ 4 జీబీ + 128 జీబీ మోడల్‌ ధర: రూ.14,999
  • రియల్​మీ 8 6 జీబీ + 128 జీబీ మోడల్​ ధర: రూ.15,999
  • రియల్​మీ 8 8 జీబీ + 128 జీబీ మోడల్​ ధర: రూ.16,999

రియల్​మీ 8ప్రో స్పెసిఫికేషన్లు(అంచనా)

  • 6.4 అంగుళా ఫుల్​ హెచ్​డీ ప్లస్​ అమోలెడ్​ డిస్​ప్లే
  • స్నాప్​డ్రాగన్​ 720జి ప్రాసెసర్
  • డ్యూయల్ సిమ్ సపోర్ట్ 
  • 108 ఎంపి ప్రైమరీ సెన్సార్​ 
  • 8 ఎంపి అల్ట్రా వైడ్​ యాంగిల్​ లెన్స్​ 
  • 2 ఎంపి మాక్రో లెన్ష్​ కెమెరా
  • 2 ఎంపి లెన్స్​ కెమెరా
  • 16 ఎంపి సెల్ఫీ కెమెరా
  • ఇన్-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యుఐ 2.0
  • రియల్​మీ 8 6 జీబీ + 128 జీబీ మోడల్​ ధర: రూ.17,999
  • రియల్​మీ 8 8 జీబీ + 128 జీబీ మోడల్​ ధర: రూ.19,999

చదవండి: ముంబై హైకోర్టులో టిక్‌టాక్ మాతృసంస్థ‌కు ఎదురుదెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement