ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శామ్సంగ్ తన గెలాక్సీ ‘ఏ’ సిరీస్ నుంచి గెలాక్సీ ఏ52, ఏ52 5జీ, ఏ72 అనే మూడు మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్ లో విడుదల చేసింది. మార్చి 17న జరిగిన ‘గెలాక్సీ ఆసమ్ అన్ప్యాక్డ్’ ఆన్లైన్ కార్యక్రమంలో ఈ మూడు మోడళ్లను విడుదల చేసింది. మూడు ఫోన్‌లు ఐపీ67 సర్టిఫైడ్ డస్ట్ - వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తాయి. గెలాక్సీ ఎ 52 మోడల్స్, గెలాక్సీ ఎ72లో క్వాడ్ రియర్ కెమెరాలతో పాటు హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్ కూడా ఉన్నాయి. శామ్సంగ్ తన కొత్త గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్లు ఒకే ఛార్జీతో రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయని పేర్కొంది. గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లు అద్భుతమైన డిస్ప్లే, ప్రో-గ్రేడ్ కెమెరా, దీర్ఘకాలిక మన్నిక ఇచ్చే బ్యాటరీకి గుర్తింపు పొందాయి. ఇప్పటికే గెలాక్సీ నుంచి వచ్చిన ఏ సిరీస్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించాయి. వీటి ధర, భారత మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు.
గెలాక్సీ ఎ52 ఫీచర్లు:
- 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే
- 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
- 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో లెన్స్ + 5 ఎంపీ డెప్త్ కెమెరా
- 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 4 జీబీ + 6 జీబీ + 8 జీబీ ర్యామ్
- 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్
- 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 11 వన్ యుఐ 3.1
గెలాక్సీ ఎ52 5జీ ఫీచర్లు:
- 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
- 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో లెన్స్ + 5 ఎంపీ డెప్త్ కెమెరా
- 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 4 జీబీ + 6 జీబీ + 8 జీబీ ర్యామ్
- 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్
- 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 11 వన్ యుఐ 3.1
గెలాక్సీ ఎ72 ఫీచర్లు:
- 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే
- 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
- 64 ఎంపీ ప్రైమరీ + 12 ఎంపి అల్ట్రా వైడ్ + 5 ఎంపీ మాక్రో షూటర్ + 8 ఎంపీ టెలిఫోటో షూటర్
- 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 6 జీబీ ర్యామ్ + 8 జీబీ ర్యామ్
- 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజ్
- 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment