కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త! | Amazon Fab Phones Fest: Get 40 Percentage offer on New Brand Mobiles | Sakshi
Sakshi News home page

కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త!

Published Mon, Mar 22 2021 7:23 PM | Last Updated on Mon, Mar 22 2021 9:47 PM

Amazon Fab Phones Fest: Get 40 Percentage offer on New Brand Mobiles - Sakshi

కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శుభవార్త అందించింది. మొబైల్ ప్రియుల కోసం అమెజాన్‌ "ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ సేల్"ను తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(మార్చి 22) నుంచి మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా అందిస్తున్నట్లు అమెజాన్‌ పేర్కొంది.

రెడ్‌మీ 9ఎ, రెడ్‌మీ 9 ప్రైమ్, వన్‌ప్లస్ 8 టీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21తో పాటు మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షిణీయమైన ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను అందిస్తుంది. త్వరలో మార్కెట్లోకి విడుదలకాబోతున్న వన్‌ప్లస్‌ 9 సిరీస్‌, వివో ఎక్స్‌60 సిరీస్‌ ఫోన్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలపై 40శాతం వరకు తగ్గింపు లభించనుంది. శాంసంగ్‌, షియోమీ, వన్‌ప్లస్‌ తదితర బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నట్లు ప్రకటించింది.

చదవండి:

అమెజాన్ క్విజ్‌: రూ.10వేలు గెలుచుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement