శామ్‌సంగ్ సంస్థ మరో బడ్జెట్ మొబైల్ గెలాక్సీ ఎం02ను ఫిబ్రవరి 2న భారతదేశంలో లాంచ్ చేయనుంది. గత ఏడాది జూన్‌లో తీసుకొచ్చిన గెలాక్సీ ఎం01 కొనసాగింపుగా కంపెనీ దీనిని తీసుకొస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02 విడుదల తేదీని వెల్లడించడంతో పాటు అమెజాన్ సైట్ లో కొన్ని ఫీచర్స్ వెల్లడించింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02పై గత కొంతకాలంగా అనేక రుమార్లు వస్తున్నాయి.(చదవండి: రిలయెన్స్ జియో మరో రికార్డ్)
గెలాక్సీ ఎం02 ఫీచర్స్:
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02 6.5-అంగుళాల హెచ్‌డి ఇన్ఫినిటీ-వి డిస్ప్లేని తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను 3జీబీ, 32జీబీ, 6జీబీ, 128జీబీ వేరియంట్లలో నవంబర్‌లో యూరప్‌లో లాంచ్ చేసిన గెలాక్సీ ఎ02 ఎస్ రీబ్రాండెడ్‌గా భావిస్తున్నారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 02 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. దీని బేస్ మోడల్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ గా ఉంది. ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ తీసుకొస్తారని భావిస్తున్నారు. దీనిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తున్నట్లు అమెజాన్ పేజీలో చూపిస్తుంది. దీని బేస్ మోడల్ ధర రూ.6999గా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment