బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62 | Samsung Galaxy F62 With 7,000mAh Battery Launched in India | Sakshi
Sakshi News home page

బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62

Published Mon, Feb 15 2021 2:04 PM | Last Updated on Mon, Feb 15 2021 2:14 PM

Samsung Galaxy F62 With 7,000mAh Battery Launched in India - Sakshi

గత ఏడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ఎఫ్-సిరీస్‌ గెలాక్సీ ఎఫ్41కు కొనసాగింపుగా శామ్‌సంగ్ కంపెనీ మరో సరికొత్త మోడల్‌ గెలాక్సీ ఎఫ్ 62ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిలో ప్రధానంగా భారీ సామర్ధ్యం గల 7,000ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. ఇప్పటికే 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. మిడ్ రేంజ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62లో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ప్రత్యేకతలున్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్ ఫిబ్రవరి 22న ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ కి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్
బ్యాటరీ: 7,000ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్ 
ర్యామ్: 6జీబీ, 8జీబీ
స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్:  ఎక్సినోస్ 9825
బ్యాక్ కెమెరా: 64 ఎంపీ + 12 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ
సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ 
కలర్స్: లేజర్ బ్లూ, లేజర్ గ్రీన్, లేజర్ గ్రే కలర్
ధర: 6జీబీ+128జీబీ - రూ.23,999
      8జీబీ+128జీబీ - రూ.25,999

చదవండి:

అదిరిపోయిన ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్

గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా ఇస్రో మ్యాప్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement