న్యూఢిల్లీ: గూగుల్ నుండి త్వరలో రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ పిక్సెల్ 6లో కొత్త ఫీచర్స్ తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మధ్య గూగుల్ తన పిక్సెల్ 6 మొబైల్లో అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాను తీసుకురావడం కోసం పేటెంట్ కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పేటెంట్లో ప్రైమరీ కెమెరా వివరాలతో సహా ఫోన్ గురించి ఇతర వివరాలను కూడా బయటికి వచ్చాయి. పేటెంట్ పిక్సెల్ 6 ప్రైమరీ కెమెరా మాడ్యూల్ యొక్క డిజైన్ చూపిస్తుంది. ఈ డిజైన్ ప్రకారం కెమెరా మాడ్యూల్‌లో రెండు సెన్సార్లు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి అని తెలుస్తుంది. గత కొన్ని వారాలుగా, 2021లో అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాలతో కొత్త మొబైల్స్ తీసుకురావడానికి అనేక ఫోన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు, గూగుల్ కూడా వాటిలో ఒకటి కావచ్చు. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ తో పని చేయనున్నట్లు సమాచారం. ఇది 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. (చదవండి: యాపిల్ బాటలో షియోమీ)
Comments
Please login to add a commentAdd a comment