ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల కంటే కూడా ఇది అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో తప్పకుండా తెలుసుకోవల్సిన మూడు ఫీచర్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.
యూఎస్‌బీ-సీ డిస్ప్లే అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది
కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు యూఎస్‌బీ-సీ డిస్ప్లే అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తాయి. యూఎస్‌బీ-సీ ద్వారా డిస్ప్లే పోర్ట్‌తో స్క్రీన్‌ని కనెక్ట్ చేయవచ్చు. దీంతో మీ మొబైల్ ఓ పాకెట్ కంప్యూటర్ మాదిరిగా మారుతుంది.
స్విచ్ఆఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చు
సాధారణంగా మొబైల్ స్విచాఫ్ అయితే దానిని ట్రాక్ చేయడం అసాధ్యం. కానీ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్ స్విచాఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చు. అయితే మొబైల్ స్విచాఫ్ అయిన కొన్ని గంటల తర్వాత కూడా ఫైండ్ మై డివైస్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి ట్రాక్ చేయగల సామర్థ్యానికి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ లేదా ఆండ్రాయిడ్ పరికరాల నుంచి డేటాను ఉపయోగించి ట్రాక్ చేయడం ద్వారా ఇది పని చేస్తుంది. మొబైల్ స్విచాఫ్ అయిన తరువాత దానిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఈ ఫీచర అలాంటి సమయంలో ఉపయోగపడుతుంది.
బ్యాటరీ సైకిల్ కౌంట్ ఇన్ఫర్మేషన్
ఈ ఫీచర్ సాదరంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోనులో ఉంటుంది. ఆ ఫీచర్ ఇప్పుడు గూగుల్ తన పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశపుట్టింది. అంటే వినియోగదారు తన స్మార్ట్‌ఫోన్‌కు ఎన్ని సార్లు ఛార్జ్ చేశారు. బ్యాటరీ ఎంత పాతది అనే విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోను 1000 ఛార్జ్ సైకిల్స్ పూర్తయితే 20 శాతం ఛార్జింగ్ కెపాసిటీ కోల్పోతుంది. అయితే గూగుల్ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment