గూగుల్ తన కెమెరా గో అప్లికేషన్‌లో హెచ్‌డిఆర్ ఫోటోలను తీయడానికి వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. "గూగుల్ కెమెరా గో అప్లికేషన్ ద్వారా ఇప్పుడు నాణ్యత గల ఫోటోలను తీసుకోవచ్చు. త్వరలో మరిన్నీ ఆండ్రాయిడ్ గో మొబైల్స్ కు ఈ హెచ్‌డిఆర్ సపోర్ట్ ఫీచర్ తీసుకురానున్నాము. దింతో ప్రతి ఒక్కరు రోజులో ఎప్పుడైనా మంచి ఫోటోలను తీసుకోవచ్చు" అని గూగుల్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. కెమెరా గో అనేది పిక్సెల్ ఫోన్లలో లభించే గూగుల్ యొక్క ప్రధాన కెమెరా అప్లికేషన్. కెమెరా గో ఇతర గో అప్లికేషన్ మాదిరిగానే ఎంట్రీ లెవెల్,బడ్జెట్ ధర కలిగిన ఫోన్‌లను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చారు. కెమెరా గోని తక్కువ ర్యామ్, నిల్వ సామర్థ్యం గల మొబైల్స్ కోసం తీసుకొచ్చారు.(చదవండి: ప్రపంచవ్యాప్తంగా మొరాయిస్తున్న ఇన్‌స్టాగ్రామ్)
కెమెరా గో అప్లికేషన్ 2020 మార్చిలో ప్రారంభించిన హెచ్‌ఎండి గ్లోబల్ యొక్క నోకియా 1.3 ఫోన్‌తో ప్రారంభమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్ మరియు ప్రీమియం ఫోన్లలో లభించే ఆధునిక కెమెరాలలో హెచ్‌డిఆర్ అనేది ఒక ఫీచర్. ఈ హెచ్‌డిఆర్ ఫీచర్ ద్వారా బడ్జెట్ మొబైల్స్ లో తీసుకునే క్వాలిటీతో ఫోటోలను తీసుకోవచ్చు. గూగుల్ తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది. సాధారణ కెమెరా గల మొబైల్స్, హెచ్‌డిఆర్ ఫీచర్ గల మొబైల్స్ కి ఉన్న తేడా ఏంటో. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తున్న ఫోన్‌ల కోసం గూగుల్ కెమెరా గో అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment