Realme V11 5g Features And Price In India | రూ.13 వేలకే రియల్‌మీ 5జీ ఫోన్ - Sakshi
Sakshi News home page

రూ.13 వేలకే రియల్‌మీ 5జీ ఫోన్

Published Fri, Feb 5 2021 8:46 PM | Last Updated on Sat, Feb 6 2021 12:29 PM

Realme V11 5G With MediaTek Dimensity 700 Processor - Sakshi

రియల్‌మీ తన చవకైన 5జీ మొబైల్ వీ11ని చైనాలో తక్కువ ధరకే విడుదల చేసింది. ఇందులో 5,000 సామర్థ్యం గల ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. రియల్‌మీ వి11 5జీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ గత నెలలో తక్కువ ధరకే రియల్‌మీ వి15 5జీని విడుదల చేసింది. 6.52 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను కూడా ఇందులో అందించారు.(చదవండి: అంతరిక్షానికి తీసుకెళ్లే వంటకాలు ఇవే!)
 
రియల్‌మీ వీ11 ఫీచర్స్:
రియల్‌మీ వీ11 5జీ 6.5-అంగుళాల డిస్‌ప్లేను 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయు ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్  తో వస్తుంది. దీని స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. రియల్‌మీ వీ11 5జీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్/2.2 లెన్స్ తో 13ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2ఎంపీ కెమెరాను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వాటర్ డ్రాప్ నాచ్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, వై-ఫై, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ ఫీచర్లను ఇందులో అందించారు. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఏకైక 4జీబీ+128జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రియల్‌మీ వీ11 5జీ ధర చైనా 1,199యువాన్లుగా(సుమారు రూ.13,500)గా ఉంది. ఇది వైబ్రాంట్ బ్లూ, క్వైట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement