షియోమీ అభిమానులకు శుభవార్త తెలిపింది రెడ్‌మీ. వచ్చే నెల మార్చిలో రెడ్‌మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు తీసుకొస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కానీ, ఖచ్చితమైన విడుదల తేదీని వెల్లడించలేదు. ఈ ఫోన్లకు సంబందించిన టీజర్ ను కూడా విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 9 సిరీస్ కొనసాగింపుగా దీనిని తీసుకువస్తుంది. రెడ్‌మీ నోట్ 10 సిరీస్ ఎన్ని ఫోన్లు తీసుకొస్తుందో స్పష్టత లేదు. షియోమీ రెడ్‌మీ నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రూ.20,000లోపే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబదించిన కొన్ని ఫీచర్స్ బయట చక్కర్లు కొడుతున్నాయి.
రెడ్‌మి నోట్ 10 సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో 120 హెర్ట్జ్ ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. రెడ్‌మి నోట్ 10 6జీబీ + 64జీబీ, 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్లలో రానున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో 4జీ, 5జీ మోడల్స్ ఉంటాయని సమాచారం. రెడ్‌మీ నోట్ 10ప్రో 5జీ మోడల్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఉంటుందని అంచనా. రెడ్‌మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు బ్రాంజ్, బ్లూ, గ్రే కలర్స్‌లో లభించే అవకాశం ఉంది.
#RedmiNote10 series - 2021's smartphone of the year is making it's way home in early March. ⚡️
— Redmi India - #RedmiNote10 Series is coming! (@RedmiIndia) February 10, 2021
India's most-loved smartphone series is getting an upgrade unlike anything anyone's ever seen before! 👀
Are you ready to be blown away by the #10on10 experience? Heads up! 🔥 pic.twitter.com/vs9KGJAhOG
చదవండి:
ఈ 20 పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ
ఆన్‌లైన్‌లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు
Comments
Please login to add a commentAdd a comment