ఓటు వేసి రియల్‌మీ నార్జో30 గెలుచుకోండి | Realme Narzo 30 India Launch Teased Win One Mobile | Sakshi

ఓటు వేసి రియల్‌మీ నార్జో30 గెలుచుకోండి

Feb 9 2021 2:24 PM | Updated on Feb 9 2021 3:32 PM

Realme Narzo 30 India Launch Teased Win One Mobile - Sakshi

రియల్‌మీ అభిమానులకు శుభవార్త. రియల్‌మీ నార్జో సిరీస్ కింద రియల్‌మీ గత ఏడాది మే నుంచి మొబైల్స్ తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సిరీస్ కింద ఇప్పటికే రియల్‌మీ నార్జో 10, నార్జో 10ఏ, నార్జో 20, నార్జో 20ఏ, నార్జో 20 ప్రో మోడల్స్ తీసుకొచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన నార్జో 20 సిరీస్‌కు కొనసాగింపుగా రియల్‌మీ నార్జో30, నార్జో30 ప్రో వంటి మొబైళ్లను తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఒక సర్వే కూడా చేపడుతుంది.

ఈ సర్వేలో భాగంగా రియల్‌మీ నార్జో 30 సిరీస్ రీటైల్ బాక్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని తన అభిమానులను కోరుతుంది. దింట్లో ఆరు ఎంపికలు ఉన్నాయి. మీరు కూడా గూగుల్ ఫారం ద్వారా ఓటు వేయవచ్చు. అలాగే ఒక లక్కీ విన్నర్ కి ఉచితంగా ఈ నార్జో మొబైల్ అందించనున్నట్టు తెలిపింది. ప్యాకేజింగ్, కంపెనీ పేరు తప్ప ఫోన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అలాగే ఇండియాలో 30లక్షల మంది రియల్‌మీ నార్జో వినియోగదారులు ఉన్నట్లు సంస్థ పేర్కొంది. వాస్తవానికి ఈ ఫోన్ జనవరిలో విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం చేపడుతున్న సర్వేను బట్టి చూస్తే త్వరలోనే తీసుకొనిరానున్నట్లు తెలుస్తుంది. రియల్‌మీ ఇటీవల రియల్‌మీ నార్జో 20 ప్రో కోసం ఆండ్రాయిడ్ 11 ఓపెన్ బీటాను రియల్‌మీ యుఐ 2.0తో పాటు అనేక ఇతర ఫోన్‌లకు విడుదల చేసింది.

చదవండి: ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్
              అదిరిపోయే ఫీచర్స్ తో విడుదలైన ఎంఐ11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement