
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఒకే రోజు మూడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. రియల్‌మీ సీ సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్లకు అప్‌గ్రేడ్ వెర్షన్ గా సీ సిరీస్‌లోనే రియల్‌మీ సీ20, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25 పేరిట మరో మూడు కొత్త మోడల్స్‌ని తీసుకొచ్చింది. మూడు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ విభిన్నంగా ఉన్నాయి. రియల్‌మీ సీ20, సీ21 మోడల్స్‌లో స్పెసిఫికేషన్స్, డిజైన్ కాస్త దగ్గరగా ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.6,999. రియల్‌మీ సీ సిరీస్ మొబైల్స్ ను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
రియల్‌మీ సీ25 స్పెసిఫికేషన్స్:
- 6.5 అంగుళాల డిస్‌ప్లే
- మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్
- 13 ఎంపీ ప్రైమరీ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో షూటర్ + 2 ఎంపీ డెప్త్ సెన్సార్
- 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 18వాట్ టైప్ సీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్
- డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్
- వాటరీ బ్లూ, వాటరీ గ్రే కలర్స్
- 4జీబీ+64జీబీ ధర రూ.9,999
- 4జీబీ+128జీబీ ధర రూ.10,999
రియల్‌మీ సీ21 స్పెసిఫికేషన్స్:
- 6.5 అంగుళాల డిస్‌ప్లే
- మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
- 13 ఎంపీ ప్రైమరీ కెమెరా + 2 ఎంపీ మ్యాక్రో షూటర్ + 2 ఎంపీ బ్లాక్ అండ్ వైట్
- 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్
- డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్
- క్రాస్ బ్లూ, క్రాస్ బ్లాక్ కలర్స్
- 3జీబీ + 32జీబీ ధర రూ.7,999
- 4జీబీ + 64జీబీ ధర రూ.8,999
రియల్‌మీ సీ20 స్పెసిఫికేషన్స్:
- 6.5 అంగుళాల డిస్‌ప్లే
- మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
- 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
- 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్
- డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్
- కూల్ బ్లూ, కూల్ గ్రే కలర్స్
- 2జీబీ + 32జీబీ ధర రూ.6,999
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment